థ్రిల్లింగ్ లవ్ స్టోరి: సౌదీ అమ్మాయి, ఇండియా అబ్బాయి
రియాద్: రియాద్ నగరంలోని ఒక కుటుంబ సభ్యులు తలలు పట్టుకున్నారు. తమ కుమార్తె ఎదురు తిరిగి ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో షాక్ తిన్నారు. తమ ఆచారాలకు వ్యతిరేకంగా కుమార్తె ప్రవర్థించడంతో ఏమి చెయ్యాలో తెలియక మత పెద్దలను సంప్రదిస్తున్నారు.
సౌదీ యువతి చేసిన తప్పు ఏమిటంటే ఒక భారతీయుడిని ప్రేమించడమని యువతి తల్లిదండ్రులు అంటున్నారు. భారత్ కు చెందిన యువకుడు సౌదీ చేరుకుని రియాద్ లోని ఒక షాపింగ్ మాల్ లో డెలివరి బాయ్‌గా ఉద్యోగం చేస్తున్నాడు.
రియాద్ లోనే నివాసం ఉంటున్న 23 సంవత్సరాల యువతి భారతీయ యువకుడిని ప్రేమించింది. అతను యువతిని ప్రేమించాడు. ఇద్దరు వివాహం చేసుకోవాలని నిర్ణయించారు. ఒక రోజు యువతి ఇంటిలో ఉన్న తన తల్లికి ప్రేమ విషయం చెప్పింది. భారతీయ యువకుడిని పెళ్లి చేసుకుంటానని తల్లిని వేడుకుంది.

ఆమె ఇంటికి వెళ్లిన భర్తకు కుమార్తె ప్రేమ విషయం చెప్పింది. అంతే ఆయన కుమార్తె మీద మండిపడ్డాడు. వెంటనే అతనిని మరిచిపోవాలని బెదిరించాడు. నేరుగా షాపింగ్ మాల్ దగ్గరకు వెళ్లాడు. వెంటనే యువకుడిని భారత్ కు వెళ్లి పోవాలని హెచ్చరించాడు.
అయితే ఆ యువకుడు తాను ఇండియా వెళ్లనని ఇక్కడే ఉంటానని ధైర్యం చేసి చెప్పాడు. ఈ విషయం అక్కడా ఇక్కడా తెలిసి మీడియా చెవిలో పడింది. రియాద్ లోని సదా అనే న్యూస్ పేపర్ లో వార్త వచ్చింది.
ఇండియా యువకుడు..... సౌదీ యువతి ప్రేమ వ్యవహారం అని పెద్ద కథనం రావడంతో యువతి తండ్రి హడలిపోయాడు. ఇప్పుడు ఆ యువకుడికి ఎదైనా జరిగితే అతని మీదకు వస్తుందని భయపడుతున్నాడు. యువతి మాత్రం తాను తమ ఆచారాలకు వ్యతిరేకంగా ప్రేమించానని తెలుసు, అయినా తనకు అతనే భర్తగా కావాలని ఇప్పటికి అతనే తన మొగుడు అని భీష్మించుకుని కూర్చుంది.












Click it and Unblock the Notifications