సౌదీ రాజు సంచలన ప్రకటన: అక్కడి యువతుల్లో ఆనందం
సౌదీ అరేబియా అంటే ముస్లిం మత సాంప్రదాయాలను కఠినంగా అమలు చేసే దేశమని అందరికీ తెలిసిన విషయమే. అయితే, తాజాగా, ఆ దేశ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ ఒక సంచలన నిర్ణయం ప్రకటించారు. దీంతో ఆ దేశంలోని యువతులు,
రియాద్: సౌదీ అరేబియా అంటే ముస్లిం మత సాంప్రదాయాలను కఠినంగా అమలు చేసే దేశమని అందరికీ తెలిసిన విషయమే. అయితే, తాజాగా, ఆ దేశ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ ఒక సంచలన నిర్ణయం ప్రకటించారు. దీంతో ఆ దేశంలోని యువతులు, మహిళలు సంబరాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సౌదీ అరేబియాలో బుర్ఖా తొలగించడం, సంరక్షకుడి అనుమతి లేకుండా విధులు నిర్వర్తించడం మహానేరం. అయితే, ఇకపై ఇలాంటి కఠిన నిబందనలు అమలుపై సడలింపు ఉంటుందని సౌదీ రాజు ప్రకటించారు. ఆ ప్రకటనలో ఇకపై అమ్మాయిలు ఎవరీ మీద ఆధారపడకుండా సొంతంగా డబ్బు సంపాదించుకుని, గౌరవంగా జీవించే హక్కు కల్పిస్తున్నామని తెలిపారు.

స్థానిక పత్రికల్లో వచ్చిన ఈ ప్రకటనలో... సౌదీ యువతులకు ప్రభుత్వ సేవా సంస్థల్లో ఉద్యోగాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రైవేటు సంస్థలు కూడా యువతుకుల ఉద్యోగాలివ్వచ్చని సూచించారు. దీనికి తల్లిదండ్రులు లేదా సంరక్షకుల సంతం కూడా అవసరం లేదని, వారి ఆమోదం ఉంటే చాలని ఆయన స్పష్టం చేశారు. 3నెలల్లో ఈ విషయం ఇస్లాం చట్టాల్లో పొందుపరుస్తామని ఆయన స్పష్టం చేశారు.
కాగా, ప్రకటన పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అయితే మహిళలు, యువతులకు ఉద్యోగం ఇచ్చిన సంస్థలే... ఆ యువతులకు తగిన రవాణా సౌకర్యం కూడా కల్పించాలని రాజు తన ప్రకటనలో స్పష్టం చేశారు. సౌదీలో మహిళలు కారు నడపటంపై నిషేధం ఉన్న నేపథ్యంలో ఆయన ఈ మేరకు ప్రకటించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications