విడాకులు: భర్త వాట్సప్ మెసేజ్‌లు పట్టించుకోని భార్య
దుబాయ్: తాను పంపిన వాట్సప్ సందేశాలు చదివి కూడా వాటికి సమాధానం ఇవ్వకపోవడంపై ఆగ్రహించిన సౌదీ వ్యక్తి ఒకతను తన భార్యకు విడాకులు ఇచ్చాడు. మిత్రులతో, కుటుంబ సభ్యులతో తెరిపి లేకుండా తన ఫోన్ ద్వారా చాటింగ్ చేస్తుండడంపై 30 ఏళ్ల వయస్సు గల ఆమె భర్త తీవ్ర నిస్పృహకు గురయ్యాడు.
తన భార్య ఎక్కువ సమయం ఫోన్ మీదనే ఉంటూ ఇంటినీ పిల్లలలను పట్టించుకోవడం లేదని ఆ వ్యక్తి ఆరోపించాడు. భర్త మెసేజ్‌లకు ఎందుకు సమాధానం ఇవ్వడం లేదని అడిగితే తాను మిత్రులతో మాట్లాడుతుండడంతో తీరిక లేకుండా పోయిందని ఆమె జవాబు ఇచ్చింది.

తన మెసేజ్‌లకు సమాధానాలు ఇవ్వడం కన్నా మిత్రులతో చాటింగ్ చేసేందుకే భార్య ప్రాధాన్యం ఇస్తోందని అతను ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి చాలా ప్రయత్నం చేశానని, అయితే తన ప్రయత్నం ఫలించలేదని అతను చెప్పాడు.
వాట్సప్‌లో తాను మెసేజ్‌లు పంపించానని, వాటిని ఆమె చదివిందని, అయినా వాటికి సమాధానాలు ఇవ్వడం గానీ వాటిని గుర్తించడం గానీ చేయలేదని అతను చెప్పినట్లు గల్ఫ్ న్యూస్ రాసింది. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్ కారణంగా ఇటీవల విడాకుల సంఖ్య పెరుగతున్నట్లు ఇటీవలి సర్వేలో తేలింది.












Click it and Unblock the Notifications