భార్య నాజుగ్గా తయారైందని విడాకులు : అసలు కారణం..

దుబాయ్ : నాజుగ్గా ఉండే అమ్మాయిలను ఇష్టపడనివారెవరుంటారు. కానీ, తన భార్య నాజుగ్గా తయారైందని విడాకులు ఇచ్చేశాడు ఓ భర్త. అయితే ఆ నాజుకుతనం వెనుక 14 లక్షల ఖర్చు ఉండడమే సదరు భర్త నిర్ణయానికి కారణమట. కాగా ఇందులో సదరు భర్త గారి తప్పిదం కూడా ఉంది. చీటికి మాటికి లావుగా ఉన్నావంటూ కామెంట్ చేయడంతో, ఎలాగైనా సన్నబడి భర్తను సర్ ప్రైజ్ చేయాలనుకున్న ఆ భార్య ఆపరేషన్ చేయించుకుని సన్నబడాలన్న నిర్ణయానికి వచ్చింది.

పూర్తి వివరాలను పరిశీలిస్తే.. సౌదీ రాజధాని రియాథ్ లో నివాసముండే ఓ వివాహిత అక్కడే టీచర్ గా పనిచేస్తోంది. కొద్దికాలం క్రితం ఆమెకు మరో ప్రాంతానికి బదిలీ కావడంతో భర్తకు దూరంగా ఉంటూ విధులు నిర్వర్తిస్తోంది. ఈ నేపథ్యంలోనే లావుగా ఉన్నావంటూ భర్త చేసే కామెంట్స్ కు ఫుల్ స్టాప్ పెట్టాలని, అతనికి సర్ ప్రైజ్ ఇవ్వాలని భావించిన సదరు భార్య ఆపరేషన్ కి సిద్దమైంది.

Saudi Man Divorces Wife Over Costly Weight-Loss Operation

మొత్తానికి రూ.14 లక్షలతో కాస్ట్లీ ఆపరేషన్ చేయించుకుని నాజుగ్గా అయితే మారింది గానీ ఆమె ప్లాన్ చేసుకున్న సర్ ప్రైజ్ మాత్రం పూర్తిగా బెడిసికొట్టింది. ఆపరేషన్ కోసం అంత డబ్బు ఖర్చు చేయడం పట్ల అసహనానికి లోనైన ఆమె భర్త ఏకంగా విడాకులే ఇచ్చేశాడు. అయితే ఇక్కడ మరో కారణం కూడా ఉంది. ఆ డబ్బును సొంత ఇంటి కలను సాకారం చేసుకునే ఉద్దేశంతో భార్యభర్తలు ఇద్దరు కలిసి పొదుపు చేసుకున్నారట. తీరా ఆపరేషన్ కోసం డబ్బు వినియోగించడంతో పరిస్థితి ఇంతదాకా వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+