వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బురఖా ధరించలేదన్న కారణంతో.. మహిళను కటకటాల్లోకి నెట్టారు!

బహిరంగ ప్రదేశాల్లో బురఖా ధరించకపోవడం.. ఆపై తన ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో సౌదీ అరేబియా పోలీసులు ఓ మహిళను అరెస్టు చేశారు.

|
Google Oneindia TeluguNews

రియాద్: ఇస్లాం మత నియమాలను నిక్కచ్చిగా పాటించే సౌదీ అరేబియాలో శిక్షలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. తాజాగా బురఖా ధరించలేదన్న కారణంగా ఓ మహిళను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. బురఖా ధరించకుండా బయటకు రావడం.. ఆపై ఫోటోను ట్విట్టర్ లో పోస్టు చేయడంతో ామెను అరెస్టు చేశామంటూ పోలీస్ ప్రతినిధి ఫవాజ్ అల్ మైమన్ పేర్కొన్నారు.

అధికారికంగా ఆమె పేరు తెలియరానప్పటికీ.. అక్కడి పలు వెబ్ సైట్లు మాత్రం ఆమె పేరు మలక్ అల్ హహరీగా పేర్కొన్నాయి. గత నెలలో రియాద్ లోని ఓ ప్రధాన రహదారి పక్కన ఆమె ఫోటో దిగడంతో పాటు దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో.. అక్కడి నెటిజెన్స్ ఆమెపై విరుచుకుపడ్డారు.

saudi woman arrested for posting veil less phot in social media

సౌదీలో అనుసరించే నైతిక నియమాల ఉల్లంఘనకు పాల్పడినందుకు గాను ఆమెకు శిక్ష విధించినట్టుగా పోలీస్ ప్రతినిధి మైమన్ తెలిపారు. సౌదీ సమాజంలో ఇంటినుంచి బయటకు వచ్చే మహిళలు ఖచ్చితంగా బురఖా ధరించాలని, మైమన్ ఆ నియమాన్ని ఉల్లంఘించడమే గాక ఓ కేఫ్ పక్కన ఫోటో దిగిందని పోలీస్ ప్రతినిధి చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం ఆమెను అరెస్టు చేసి జైల్లో పెట్టినట్టు తెలుస్తుండగా.. నిషేధించిన పలు అంశాల గురించి పరాయి పురుషులతో మాట్లాడినట్టుగా ఆమెపై పలువురు ఆరోపణలు చేస్తున్నారు. ఇస్లాం బోధనలకు సౌదీ ప్రజలంతా కట్టుబడి ఉండాల్సిందేనని అక్కడి మతపెద్దలు చెబుతున్నారు.

English summary
Police in the Saudi capital said on Monday they had arrested a woman for taking off her veil in public and posting pictures of her daring action on Twitter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X