పాకిస్థాన్ కు ఏకంగా రూ. 1,53,342 కోట్లు లాస్..! అప్పు తెచ్చిన డబ్బులూ అయిపాయే..!

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ప్రపంచ దేశాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. పేద, అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ప్రపంచ దేశాలతో పాటు పాకిస్థాన్ కూడా తీవ్ర ఇబ్బందులను ఎదర్కొంటోంది. యుద్ధం కారణంగా ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసివేసిన కారణంగా చమురు, గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. దాంతో పాకిస్థాన్ లో ప్రస్తుతం లాక్ డౌన్ నడస్తోంది. దీన్ని బట్టే అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం అవుతుంది. రాత్రి 8 గంటల కల్లా షాపులు, మార్కెట్స్ మూసివేస్తున్నారు. ఇప్పటికే అక్కడి పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ఇచ్చారు. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాక దేశంలో ద్రవ్యోల్బణం కారణంగా ధరలు పెరిగాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు.

ఇక పాకిస్థాన్ కు మరో బిగ్ షాక్ తగిలింది. పాకిస్థాన్- సూడాన్ మధ్య జరిగిన డిఫెన్స్ ఒప్పందంలో భాగంగా సూడాన్ కు పాకిస్థాన్ నుంచి వెళ్లాల్సిన 10 కారకోరం యుద్ధ విమానాలు, డ్రోన్ లు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్ని అనూహ్యంగా సౌదీ అరేబియా అడ్డుకుంది. దాంతో పాకిస్థాన్ కు బిగ్ షాక్ తగిలింది. పాకిస్థాన్- సూడాన్ మధ్య జరిగిన రూ.12,500 కోట్ల ఒప్పందం రద్దు అయినట్లు సమాచారం. ఇక ఈ డీల్ రద్దు కావడంతో పాకిస్థాన్ కు ఆర్థికంగా భారీ నష్టం వాటిల్లనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అసలే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న పాకిస్థాన్ కు ఈ ఘటన మరింత భారంగా మారినట్లు స్పష్టం అవుతోంది.

ఈ డీల్ తో పాటుగా పాకిస్థాన్ లిబియాతోనూ ఓ రక్షణ ఒప్పందం కుదుర్చుకోవాలని ప్రణాళికలు వేసింది. ఆ ఒప్పందం విలువ 4 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే ఈ డీల్ కూడా ప్రమాదంలో ఉన్న తరుణంలో పాకిస్థాన్ కు ఒకేసారి 5.5 బిలియన్ డాలర్ల ఆదాయం కోల్పోయే ప్రమాదం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ప్రస్తుతం సూడాన్ లో అంతర్యుద్ధం జరుగుతోంది.

SaudiArabia Blocks 12 500 Crore Pakistan-Sudan Arms Deal Delivering a Major Blow Islamabad Economy

సూడాన్ సైన్యం, పారామిలిటరీ దళాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. పాకిస్థాన్ ఆయుధాలతో సూడాన్ సైన్యం యుద్ధం చేయాలని భావించింది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇక సూడాన్ సైన్యం ఇరాన్ కు సపోర్ట్ గా మాట్లాడడం, గల్ఫ్ దేశాలపై దాడులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వల్ల సౌదీ అరేబియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. ఈ మేరకు డీల్ ను రద్దు చేసుకోవాలని పాకిస్థాన్ కు ఆదేశాలు జారీ చేసింది సౌదీ అరేబియా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+