వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమ్మాయిలకు వార్నింగ్: కురచ దుస్తులుతో రావద్దు

By Pratap
|
Google Oneindia TeluguNews

లండన్: కురచ దుస్తులు వేసుకుని వచ్చి అందరిని ఇబ్బందికి గురి చెయ్యరాదని అమ్మాయిలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఈ హెచ్చరికలు చేసింది సంసృతి, సాంప్రదాయాలకు నిలయం అయిన భారత్ లో కాదు, అక్షరాల లండన్ లోని ఒక స్కూల్ లో.

ఇంగ్లాండ్ వెస్ట్ మిడ్ లాండ్స్ ప్రాంతంలోని ట్రెంథమ్ హై స్కూల్ లో 7 నుండి 11వ తరగతి వరకు చదువుతున్న అమ్మాయిలు చాల కురచ దస్తులు వేసుకుని స్కూల్ కు వెళుతున్నారు. విషయం గుర్తించిన ఆ స్కూల్ హెడ్ మాస్టర్ డాక్టర్ రొవెనా బ్లెన్ కొవ్ అమ్మాయిలను పిలిచి మందలించారు.

School bans girls from Wearing skirts in london

ఇాలాంటి కురచ దుస్తులు వేసుకుని రావద్దని గట్టిగా చెప్పారు. అయినా మాట వినని అమ్మాయిల కుటుంబ సభ్యులను పిలిపించి ప్యాంట్లు వేసి పంపించాలని సూచించారు. అప్పటికీ పట్టించుకోని అమ్మాయిలను స్కూల్ నుండి పంపించేశామని హెడ్ మాస్టర్ డాక్టర్ రొవెనా చెప్పారు.

9,10,11వ తరగతి చదువుతున్న అమ్మాయిలు కురచ దస్తులు వేసుకుని రావడం వలన అబ్బాయిలు, మగ టీచర్లు కొన్ని ఇబ్బందులకు గురి అవుతున్నారని గుర్తు చేశారు. ఇలాంటి వాతావరణం స్కూల్ ఆవరణంలో ఉండకూడదనే ఉద్దేశంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నాని డాక్టర్ రొవెనా తెలిపారు.

English summary
A school has banned pupils from wearing skirts because they are distracting male teachers and pupils.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X