వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీచర్ మీద కత్తితో దాడి చేసిన విద్యార్థి అరెస్టు

|
Google Oneindia TeluguNews

లండన్: పాఠం చెబుతున్న టీచర్ మీద విద్యార్థి కత్తితో దాడి చేసి హత్యాయత్నం చేసి పరారైన సంఘటన లండన్ లో జరిగింది. పోలీసులు హత్యాయత్నం చేసిన బాలుడిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

లండన్ లోని పోర్డ్ లోని డైకాన్స్ కింగ్స్ అకాడమీలో 14 సంవత్సరాల బాలుడు విద్యాభ్యాసం చేస్తున్నాడు. ఇదే స్కూల్ లో విన్సెంట్ ఉజోమ్స్ (50) ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. గురువారం ఉదయం విన్సెంట్ స్కూల్ లో పాఠం చెబుతున్నారు.

School Boy arrested for Stabbing teacher

అదే సమయంలో అక్కడికి వచ్చిన విద్యార్థి పదునైన కత్తి తీసుకుని విన్సెంట్ మీద దాడి చేసి మొబైల్ లాక్కొని అక్కడి నుండి పరారైనాడు. సెక్యూరిటి గార్డుల కళ్లు గప్పి స్కూల్ క్యాంపస్ నుండి బయటకు వెళ్లిపోయాడు. విషయం గుర్తించిన స్కూల్ సిబ్బంది విన్సెంట్ ను ఆసుపత్రికి తరలించారు.

బ్రాడ్ పోర్డ్ నగరంలో పాకిస్థాన్ దేశస్తులు ఎక్కువగా నివాసం ఉంటున్నారని పోలీసు అధికారులు చెప్పారు. అయితే హత్యాయత్నం చేసిన బాలుడిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. లండన్ లో కత్తి తో దాడి చేస్తే పెద్ద శిక్ష వేస్తారు.

English summary
The 50-year-old supply teacher, named locally as Vincent Uzomah, was taken to hospital from the Dixons Kings Academy, in Bradford,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X