అమెరికా అధ్యక్షులను ఆ పిల్లలే నిర్ణయిస్తారు.
అమెరికా :అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం హోరా హోరిగా ప్రచారం సాగుతోంది. కొన్ని గంటల్లోనే ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల ఫలితాల కోసం ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కాని, అమెరికా అద్యక్షులను ఓ స్కూల్ విద్యార్థులు నిర్ణయిస్తారు. ఈ స్కూల్ విధ్యార్థులు నిర్ణయించే వారే అమెరికా అధ్యక్షులుగా ఎన్నిక అవుతున్నారు. ఈ దఫా కూడ ఈ పిల్లలు చెప్పిన వారే అధ్యక్షులుగా ఎన్నిక అవుతారని అమెరికన్లు విశ్వసిస్తున్నారు.
కొందరికి కొన్ని రకాల సెంటిమెంట్లుంటాయి. అమెరికన్లు అధ్యక్ష ఎన్నికల్లో ఈ స్కూల్ విద్యార్థులు చెప్పే జోస్యాలను విశ్వసిస్తారు. 40 ఏళ్ళుగా ఈ విశ్లేషణలు నిజమౌతున్నాయి.దీంతో ఈ స్కూల్ విద్యార్థులు చెప్పే దాన్ని వారు నిజమని బావిస్తున్నారు.. ఎన్నికల సమయంలో సర్వేలు,విశ్లేషణలు, ప్రజల అభిప్రాయాలను ప్రామానికంగా తీసుకొని ఎవరు గెలుస్తారనే దానిపై అభిప్రాయానికి వస్తారు. కాని, అమెరికన్లు స్కూల్ విద్యార్థుల అభిప్రాయాలకు ఎందుకు విలువ ఇస్తున్నారనేది ఆసక్తి గా మారింది.
అమెరికా అద్యక్ష ఎన్నికల్లో 1968 నుండి ఈ స్కూల్ విద్యార్థులు చెబుతున్నవారే అద్యక్షులుగా ఎన్నిక అవుతాున్నారు.అమెరికాలోని బెంజిమెన్ ఫ్రాంక్లిన్ స్కూల్ వేసే అంచనాలు అమెరికా అధ్యక్ష ఎన్నిల ఫలితాల్లో వాస్తవాలు గా మారుతున్నాయని తేలింది. 48 ఏళ్ళుగా ఈ స్కూల్ విధ్యార్థులు చెబుతున్నట్టుగా అమెరికాలో అధ్యక్షులుగా అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు.

ప్రతి అమెరికా అధ్యక్షుడి ఎన్నికల సమయంలో మాదిరిగానే ఈ దపా కూడ ఈ పాఠశాలలో బుదవారం నాడు ఎన్నికలు జరిగాయి.ఈ స్కూల్ లో నిర్వహించే మాక్ ఎన్నికల్లో విజేతలే అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక అవుతారు.ఈ ఎన్నికల్లో ఓటేసే విధ్యార్థులకు ఏ అభ్యర్థికి ఓటేస్తున్నారో తెలియదు. ఏ క్యాండెట్, బి క్యాండెట్ పేరుతో ఓటు చేయాల్సి ఉంటుంది. విధ్యార్థులు ఓటు వేసిన వారిలో ఎక్కువ ఓట్లు వచ్చిన వారిని విజేతగా ప్రకటిస్తారు స్కూల్ యాజమాన్యం.
హిల్లరే విజేత
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈ దఫా డమొక్రటిక్ పార్టీ అభ్యర్థఇ హిల్లరీ క్లింటన్ విజయం సాధించనుంది పాఠశాల యాజమాన్యం ప్రకటించింది.డమొక్రటిక్ పార్టీ అభ్యర్థి 277 ఒట్లతో (52 శాతం) అగ్రస్థానంలో నిలిచింది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కు 230 ఓట్లు (43 శాతం) ఓట్లు వచ్చాయి.తమ అంచనాల ప్రకారంగా ఈ ఎన్నికల్లో హిల్లరీయే విజయం సాధిస్తారని పాఠశాల యాజమాన్యం ప్రకటించింది.
48 ఏళ్ళుగా ఈ పాఠశాలలో వజేతగా నిలిచిన వారే అమెరికా అధ్యక్షులు అవుతున్నారు. అయితే ఈ దపా నిర్వహించిన మాక్ ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ విజయం సాధించింది.దీంతో హిల్లరీయే విజయం సాధిస్తారని స్కూల్ యాజమాన్యం విశ్వాసాన్ని వ్యక్తం చేస్తోంది. ప్రతి సారి జరిగినట్టుగానే ఈసారి కూడ జరుగుతోందా... లేదా ఫలితం తారుమారు కానుంా అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది.












Click it and Unblock the Notifications