ఎంత పొడవు అయితే ఏంటి, అమ్మాయి దుమ్ములేపింది (వీడియో)
బ్రిటన్: స్కూల్ కు వెళ్లి తిరిగి ఇంటికి వెళుతున్న బాలిక వెంటపడిన బాలుడు పిడిగుద్దులు తిన్నాడు. కొట్టింది బాలిక కుటుంబ సభ్యులు కాదు, పోలీసులు కాదు, స్థానికులు కాదు. తన కంటే ఎంతో పొడుగు ఉన్నా ఆ బాలిక లెక్క చెయ్యలేదు. 14 సంవత్సరాల బాలిక స్కూల్ యూనిఫాంలోనే అతనికి దేహశుద్ది చేసింది.

షర్టు పట్టుకుని మరి దగ్గరకు లాగి లాగి ముఖం పగిలిపోయేటట్లు చితకబాదింది. ఆ సమయంలో ఒకరు అడ్డు వెళితే "వెళ్లి నీ పని నీవు చూసుకో" అని హెచ్చరించింది. నిత్యం వెంటపడి వేధించడంతో పాటు ఆ బాలుడు ఆ పరిసర ప్రాంతాలలో శ్రీమంతుల పిల్లలకు డ్రగ్స్ విక్రయిస్తున్నాడని వెలుగు చూసింది.
ఈ దాడి క్లిప్పింగ్ లు మే 14వ తేదీన సోషల్ మీడియాలో పెట్టారు. ఇప్పటి వరకు 2.7 మిలియన్ల క్లిక్ లు వచ్చాయి. అనేక మంది కామెంట్లు పెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు బాలిక సహాయంతో డ్రగ్స్ విక్రయిస్తూ అమ్మాయిలను వేదిస్తున్న బాలుడిని అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications