అంచనా: 2030 నాటికి చంద్రుడిపై ఊళ్లు

లండన్: వ్యోమగాములు, రోబోటిక్ వ్యవస్థల మధ్య సహకారంతో చంద్రుడిపై గ్రామాలను నిర్మించాలన్న స్వప్నం 2030 సంవత్సరంలోగా ఫలించవచ్చునని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. భవిష్యత్తులో అంగారక గ్రహంతోపాటు మానవాళి జరిపే ఇతర ఖగోళ ప్రయోగాలకు ఈ గ్రామాలు వేదికగా మారుతుందని అంటున్నారు.

‘మూన్ 2020-2030-ఎ న్యూ ఎరా ఆఫ్ కోఆర్డినేటెడ్ హ్యూమన్ అండ్ రోబోటిక్ ఎక్స్‌ప్లోరేషన్' అనే అంశంపై నెదర్లాండ్స్‌లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఇఎస్‌ఎ) నిర్వహించిన సింపోజియంలో శాస్తవ్రేత్తలు, ఇంజనీర్లు, పారిశ్రామిక నిపుణుల బృందం ఆ విషయాలు వెల్లడించింది.

చంద్రునిపై గ్రామాలను నిర్మించాలన్న కలను నిజం చేయాలంటే తొలుత అక్కడ మనం అనుకుంటున్నంత పెద్దమొత్తంలో వనరులు ఉన్నాయా లేవా అనే విషయాన్ని శాస్తవ్రేత్తలు నిర్ధారించాల్సిన అవసరం ఉందని అమెరికాలోని నోట్రె డామ్ యూనివర్శిటీ శాస్తవ్రేత్త క్లైవ్ నెయల్ అన్నారు.

 Scientists predict the possibility of villages on Moon by 2030

ఇప్పటికీ మనం చంద్రునిపై ఉన్న వనరుల గురించే మాట్లాడుకుంటున్నామని, కానీ అవి నిజంగా మనకు ఎంతమేరకు ఉపయోగపడతాయన్న విషయాన్ని నిర్ధారించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.అందువల్ల మనం తదుపరి అడుగులో చంద్రునిపై వనరులను వెలికితీసి వినియోగానికి అనువైనవిగా వాటిని శుద్ధి చేసుకోగలగాలని అన్నారు.

ఈ పని విజయవంతంగా పూర్తి చేయగలిగితే చంద్రునిపై ఉన్న వనరులు సౌర కుటుంబ అన్వేషణకు ఎంతమేర ఉపయోగపడతాయన్నదీ తెలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+