కడుపులో కత్తెర.. 18ఏళ్లకు బయటపడింది..
అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించి.. కడుపులో 15సెం.మీ కత్తెర ఉన్నట్టు గుర్తించారు.
వియత్నాం: ఓ వ్యక్తికి శస్త్రచికిత్స చేసిన వైద్యులు కత్తెరను మాత్రం కడుపులోనే పెట్టేసి కుట్లేశారు. మరింత ఆశ్చర్యం కలిగించే విషయమేంటంటే.. 18సంవత్సరాల తర్వాత ఆ కత్తెరను కడుపు నుంచి బయటకు తీశారు.
వివరాల్లోకి వెళ్తే.. వియత్నాంకి చెందిన వాన్‌హత్ అనే వ్యక్తి 1998లో కారు ప్రమాదంలో గాయపడ్డాడు. ప్రమాదంలో అంతర్గత గాయాలు కావడంతో అతని కడుపుకు శస్త్ర చికిత్స చేశారు. ప్రావిన్స్‌లోని ఓ ఆస్పత్రిలో ఈ చికిత్స జరగ్గా.. చికిత్స సమయంలో ఉపయోగించిన కత్తెరను పొరపాటున పొట్టలోనే ఉంచి కుట్లు వేశారు.

అయితే ఇన్నేళ్ల జీవితంలో వాన్ హత్ కి ఆ కత్తెర వల్ల ఎప్పుడూ ఇబ్బందులు తలెత్తలేదు. ఈమధ్యే కడుపులో నొప్పి తీవ్రం కావడంతో..తప్పనిసరై వైద్యులను సంప్రదించాడు. దీంతో అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించి.. కడుపులో 15సెం.మీ కత్తెర ఉన్నట్టు గుర్తించారు.
వెంటనే కత్తెరను తొలగించడానికి శస్త్ర చికిత్స చేశారు. దాదాపు నాలుగు గం.ల పాటు శస్త్ర చికిత్స చేసి ఎట్టకేలకు కడుపు నుంచి కత్తెరను తొలగించారు. ప్రస్తుతం వాన్ హత్ కోటుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. 1998లో వాన్ హత్ కు శస్త్ర చికిత్స చేసిన వైద్యుడి కోసం ఇప్పుడు విచారిస్తున్నారు.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications