Viral News: ప్రేయసితో శృంగారానికి సెక్యూరిటీ ఏజెంట్ దుస్సాహసం.. ప్లేస్ ఏంటో తెలిస్తే ఫ్యూజులు అవుట్..

Obama house: శృంగారానికి సంబంధించి ఎవరి ఇష్టాలు వారివి. అయితే ఓ జంట చేసిన పని మాత్రం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఎవరూ కనీసం సాహసం కూడా చేయని చోట వారు ఆ పనికి సిద్ధమయ్యారు. ఇది జరిగిన వెంటనే దీని గురించి అంతగా తెలియలేదు కానీ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఎందుకంటే వారు శృంగారం చేసేందుకు ఎంచుకున్నది ఏకంగా అమెరికా మాజీ అధ్యక్షుడి ఇల్లు మరి.

రీసెంట్‌గా ప్రచురితమైన 'అండర్‌కవర్ హార్ట్‌బ్రేక్: ఎ మెమాయర్ ఆఫ్ ట్రస్ట్ అండ్ ట్రామా' అనే పుస్తకం తెగ వైరల్ అవుతోంది. దానిలో ప్రస్తావించిన ఓ అంశమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. 2022లో ఓ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ చేసిన దుస్సాహసం గురించి ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడిగా సేవలందించిన బరాక్ ఒబామా ఇంట్లో జరిగిన ఓ సంఘటన అందులో ప్రస్తావించారు.

Secret service agent sex invitation to lover in Michelle Obama bathroom

ఒబామా కుటుంబానికి హవాయిలోని తీర ప్రాంతంలో ఓ నివాసం ఉంది. వారు ఇంట్లో లేనప్పుడు తన ప్రియుడు సెక్యూరిటీ ప్రోటోకాల్స్‌ను సైతం ఉల్లంఘించి తనను అక్కడికి తీసుకెళ్లినట్లు పుస్తక రచయిత కొర్యియర్ ద్వానెన్ తెలిపారు. అంతటితో ఆగకుండా మిషెల్ ఒబామా బాత్రూమ్‌లో శృంగారం చేయాలని కోరినట్లు చెప్పి షాక్ ఇచ్చింది. 'ఎవరికీ తెలియదు. ఏదైనా జరిగితే నేను ప్రమాదంలో పడతాను. నీకు ఎటువంటి ఇబ్బంది రాదు' అని 'డేల్' అనే ఆ ఏజెంట్ తనకు భరోసా ఇచ్చినట్లు పేర్కొన్నారు.

కొంతమంది దీన్ని కల్పిత కథ అని అనుమానించారు. అయితే ప్రముఖ మీడియా సంస్థ ఈ సంఘటన నిజమేనని ధ్రువీకరించింది. దర్యాప్తు అనంతరం ఆ ఏజెంట్‌ను తొలగించారనే విషయాన్ని వెల్లడించింది. 'ప్రొటెక్టివ్ విధుల్లో ఉన్న ఒక సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ అనుమతి లేకుండా ఒక నిర్ధిష్ట వ్యక్తిని ప్రొటెక్టీ నివాసానికి తీసుకువచ్చాడు. దర్యాప్తు తర్వాత అతన్ని విధుల నుండి తొలగించారు' 2022 నవంబర్ 6న ఒక సీక్రెట్ సర్వీస్ ప్రతినిధి స్పష్టం చేసినట్లు పేర్కొంది. సంఘటన జరిగిన సమయంలో ఒబామాలు అక్కడ లేకపోయినప్పటికీ, ప్రోటోకాల్ అతిక్రమణ కారణంగా అతడిపై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+