వారి ఆస్తులు సీజ్ చేయాలి! దావూద్‌పై షాకింగ్ అంశాలు, అతని 25 పేర్లు ఇవే
న్యూఢిల్లీ: దావూద్ ఇబ్రహీం, హఫీజ్ సయీద్, జకీ వుర్ రెహ్మాన్ లఖ్వీల ఆస్తులను పాకిస్తాన్ ప్రభుత్వం సీజ్ చేయాలని భారత దేశం భావిస్తోంది. ఈ విషయమై త్వరలో భారత్ పాకిస్తాన్‌ను కోరనుందని తెలుస్తోంది.
పాకిస్తాన్ కూడా ఉగ్రవాదం బాధితురాలే గనుక ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో అది అన్ని రకాల సాయం అందించాలని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ఉగ్రవాదాన్ని అదుపు చేయడంలో పాక్ పూర్తి సహకారం అందించాలి, ఎందుకంటే ఇప్పుడు అది కూడా అలాంటి సమస్యనే ఎదుర్కొంటోందన్నారు.
ఉగ్రవాదుల ద్వారా ఉగ్రవాదులను అంతమొందించడం గురించి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై పాక్ తీవ్రంగా స్పందించడం గురించి ప్రస్తావిస్తూ... ఉగ్రవాదాన్ని ఎవరు ప్రోత్సహిస్తున్నారో భారత్‌లోనే కాదు, మొత్తం ప్రపంచంలో అందరికీ తెలుసన్నారు.
పారికర్ వ్యాఖ్యలపై జాతీయ భద్రత, విదేశీ వ్యవహారాలపై పాక్ ప్రధానమంత్రి సలహాదారు సర్తాజ్ అజీజ్ స్పందిస్తూ.. తమ దేశంలో ఉగ్రవాదంతో భారత్‌కు ప్రమేయం ఉందన్న పాకిస్తాన్ ప్రభుత్వ భయాలను ఆ వ్యాఖ్యలు ధ్రువీకరించాయని అన్నారు.
ఉగ్రవాదాన్ని లేదా దాని ప్రభుత్వేతర శక్తులను అడ్డుకోవడం అనే సాకుతో మరో దేశంలో ఉగ్రవాదాన్ని ఉపయోగించాలని ఒక ఎన్నికయిన ప్రభుత్వంలోని ఒక మంత్రి చెప్పడం ఇదే మొదటిసారని పాక్ విదేశాంగ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో అజీజ్ అన్నారు.

దావూద్ ఇబ్రహీం గురించి షాకింగ్ విషయాలు
దావూద్ ఇబ్రహీం 25 పేర్లతో చలామణి అవుతుంటాండని తెలుస్తోంది. అతనికి 11 పాస్ పోర్టులు ఉన్నాయి. అందులో భారత్ ఇష్యూ చేసినవే ఆరు. ప్రపంచవ్యాప్తంగా చేసే నేరాలకు దావూద్ ఇబ్రహీం వివిధ పేర్లు వాడుతుంటాడు. అంతర్జాతీయ తీవ్రవాదంలో దావూద్ ఇబ్రహీంకు ఇచ్చిన నెంబర్ 13,224.
దావూద్ ఇబ్రహీంకు చెందిన 25 పేర్లు ఇవే...
అబ్దుల్ హమీద్ అబ్దుల్ అజీజ్
అనీస్ ఇబ్రహీం
అజిజ్ దిలీప్
దౌద్ హాసన్ షేక్ ఇబ్రహీం కస్కర్
దౌద్ ఇబ్రహీం మీమన్
దౌద్ ఇబ్రహీం మీమన్ కస్కర్
దౌద్ హాసన్ షేక్ ఇబ్రహీం కస్కర్
దావూద్ ఎబ్రహీం
దావూద్ హసన్ ఇబిరహీం కస్కర్
దావూద్ హసన్
దావూద్ హసన్ షేక్
దావూద్ ఇబ్రహీం
దావూద్ ఎబ్రహీం కస్కర్
దావూద్ ఇబ్రహీం మీమన్
దావూద్ షాబ్రీ
దావూర్డ్ ఇబ్రహీం
దావూద్ హసన్ షేక్ ఇబ్రహీం
హీజారత్
ఇబ్రహీం షేక్ మొహ్మద్ అనీస్
కస్కర్ దావూద్ హసన్
షేక్ దౌద్ హసన్
షేక్ ఇస్మాయిల్ అబ్దుల్
షేక్ మహమ్మద్ ఇస్లాయిల్ అబ్దుల్ రెహ్మాన్
షేక్ దావూద్ హసన్
షేక్ ఇబ్రహీం












Click it and Unblock the Notifications