పిచ్చి ముదిరింది: తాత శవంతో సెల్ఫీ దిగాడు

లండన్: సెల్ఫీల పిచ్చి యువతలో వింత దోరణులకు దారితీస్తోంది. సెల్ఫీల పిచ్చితో కొందరు ప్రాణాలు కోల్పోతుంటే.. మరికొందరు తమ పిచ్చితో ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇటీవల తాత మరణించడంతో ఆ కుటుంబం మొత్తం విషాదంలో ఉంటే.. మనవడైన ఓ యువకుడు ఆ తాత శవంతో సెల్పీ దిగాడు. అంతేగాక, ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

ఈ ఘటన దుబాయ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సౌదీ అరేబియాకు చెందిన ఓ యువకుడు మరణించిన తాత పక్కన సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మంచంపై తాత మృతదేహం పక్కన విచిత్రమైన హావభావాలతో మొహం పెట్టి, నాలుకను బయటకు చాచి సెల్ఫీ దిగాడు.

Selfie with grandfather's body draws social media outrage

ఈ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, పక్కన 'గుడ్ బై గ్రాండ్ ఫాదర్' అంటూ రాసుకున్నాడు. చావుకు, శుభాలకు తేడా తెలియని ఈ ఫొటో చూసి నెటిజెన్లు షాక్ అయ్యారు. కుర్రాడి ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక ఫిర్యాదులు రావడంతో ఈ సంఘటనపై సౌదీ అధికారులు విచారణకు ఆదేశించారు.

సెల్ఫీ దిగిన కుర్రాడిది కనీస బాధ్యతలేని చర్య అని, నైతిక విలువలను ఉల్లంఘించడమేనని మదీన ప్రాంత మీడియా, ప్రజాసంబంధాల అధికారి అబ్దుల్ రజాక్ అన్నారు. ఈ ఘటన నేరమని, ఆ కుర్రాడిని శిక్షించాలని సౌద్ అల్ హర్బీ అనే న్యాయవాది అన్నారు. ఇలాంటి చర్యలను ఇతరులు పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+