మైనర్ బాలికతో సెక్స్ కు రెడీ, ఫేస్ బుక్ ఉన్నతోద్యోగి అరెస్టు
మైనర్ బాలికతో శృంగారానికి ముందుకు వచ్చి ఫేస్ బుక్ లో సీనియర్ ఉద్యోగిని సీటెల్ లో పోలీసులు అరెస్టుచేశారు. పోలీసులు పథకం ప్రకారం వలపన్ని ఆయన్ను అరెస్టు చేశారు.
సీటెల్ :మైనర్ బాలికతో శృంగారానికి ఒప్పుకొని అడ్డంగా బుక్కయ్యాడు ఓ వ్యక్తి ,అయితే మైనర్ బాలికతో సెక్స్ కోసం తాను 350 డాలర్లు చెల్లించేందుకు ముందుకు వచ్చాడు. మైనర్ బాలిక పేరుతో వల వేసి నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు ఫేస్ బుక్ లో సీనియర్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకొంది.
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఫేస్ బుక్ లో కంప్యూటర్ విభాగంలో సీనియర్ విజన్ హెడ్ గా డోవ్ కట్జ్ పనిచేస్తున్నాడు. అయితే ఆయన మైనర్ బాలికతో శృంగారాన్ని కోరుకొన్నాడు.ఆయన 15 ఏళ్ళ బాలికతో శృంగారాన్ని చేసేందుకు సుమారు 350 డాలర్లను చెల్లించేందుకు ముందుకు వచ్చాడు.
డోవ్ వ్యవహరాన్ని గమనించిన పోలీసులు మైనర్ బాలిక పేరుతో ఆయనను ట్రాప్ చేశారు. శృంగార నేరగాళ్ళను పట్టుకొనేందుకుగాను పోలీసులు పథకం ప్రకారం వ్యవహరించారు. ఈ ఘటనలో డోవ్ బుక్కయ్యాడు. 19 ఏళ్ళ యువతి పేరుతో టుక్ విలా పోలీసులు డోవ్ కు మేసేజ్ పంపారు.

తన వయస్సు 15 ఏళ్ళు అని చట్టపరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున తన వయస్సును మార్చి చెప్పినట్టుగా డోవ్ కు మెుయిల్ లో పోలీసులు వివరించారు. అయితే తనకు మైనర్ బాలిక అయినా ఇబ్బందేమీ లేదని డోవ్ వివరించాడు
ఆయనను హోటల్ కు పంపించి పోలీసులు అరెస్టు చేశారు. ఇజ్రాయిల్ కు చెందిన డోవ్ కాలిఫోర్నియాలో నివసిస్తున్నాడు. తన కంపెనీని ఫేస్ బుక్ లో విలీనం చేసి అక్కడ మంచి స్థానంలో ఉన్నాడు.












Click it and Unblock the Notifications