లాహోర్‌లో ఆత్మాహుతి: 16మంది మృతి, 60మందికి గాయాలు
ఆత్మాహుతి బాంబు దాడితో పాకిస్తాన్‌లోని లాహోర్ సోమవారం సాయంత్రం రక్తమోడింది.
లాహోర్: ఆత్మాహుతి బాంబు దాడితో పాకిస్తాన్‌లోని లాహోర్ సోమవారం సాయంత్రం రక్తమోడింది. నగరంలోని పంజాబ్ అసెంబ్లీ ముందు నిరసన ప్రదర్శన జరుగుతుండగా ఒక వ్యక్తి తనను తాను పేల్చేసుకోవడంతో 16 మంది మరణించగా... దాదాపు 60 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో దాదాపు 11 మంది పరిస్థితి విషమంగా ఉందని పంజాబ్ ఆరోగ్య శాఖ మంత్రి సల్మాన్ రఫీక్ తెలిపారు.

పోలీసులే లక్ష్యంగా..
మృతుల్లో లాహోర్ ట్రాఫిక్ పోలీసు చీఫ్ అహ్మద్ మొబీన్ , సీనియర్ ఎస్పీ జహీద్ కూడా ఉన్నారని లాహోర్ పోలీసు కమిషనర్ అమిన్ వైన్స్ చెప్పారు. లాహోర్ పోలీసులే లక్ష్యంగా దుండగుడు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని పోలీసు అధికారులు వెల్లడించారు.

ఆందోళనలోనే పేలుడు..
తమ సమస్యల్ని పరిష్కరించాలంటూ ఫార్మాస్యూటికల్స్ తయారీదారుల ఆందోళన నిర్వహిస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఆందోళనకారులతో చర్చించేందుకు ట్రాఫిక్ పోలీసు చీఫ్ మొబీన్ ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది.

పేల్చేసుకున్నాడు..
మోటారుసైకిల్‌పై వచ్చిన దుండగుడు తన వాహనాన్ని పోలీసు అధికారుల సమీపంలోకి తీసుకెళ్లి పేల్చేసుకున్నాడు. పంజాబ్ అసెంబ్లీ భవనం, గవర్నర్ నివాసాలపై ఉగ్రవాదులు దాడికి పాల్పడవచ్చని నిఘా సంస్థలు ముందే హెచ్చరించాయని పంజాబ్ న్యాయ శాఖ మంత్రి రానా సనుల్లాహ్ తెలిపారు.

అడ్డుకోలేకపోయాం..
నిఘా సంస్థలు హెచ్చరించినా.. పేలుడును అడ్డుకోలేకపోయామని తెలిపారు. ముందస్తు చర్యలు పటిష్టంగా తీసుకుంటే ప్రమాదం తప్పే అవకాశం ఉండేదని ఆయన చెప్పారు.
-
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్‌కు తాకట్టు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications