రేప్ కేసు: పోలీసు అధికారికి 100 ఏళ్లు జైలు

కౌలాలంపూర్: మలేషియాలో బాలిక మీద అత్యాచారం చేసిన ఓ సీనియర్ పోలీసు అధికారికి కోర్టు కఠిన కారాగార శిక్ష విధించింది. ఇక మీద ఏ పోలీసు అధికారి ఇలా చెయ్యరాదని కోర్టు కఠిన శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.

డిప్యూటీ సూపరింటెండెంట్ రోహైజత్ అబ్దుల్ అని (54) అనే కామాంధుడికి 100 సంవత్సరాల జైలు శిక్ష, 15 కొరడా దెబ్బలు కొట్టాలని కోర్టు తీర్పు చెప్పింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

రోహైజత్ అబ్దుల్ అని డిప్యూటీ సూపరింటెండెంట్ గా ఉద్యోగం చేసేవాడు. 2012వ సంవత్సరంలో 13 ఏళ్ల బాలికను ఓ హోటల్ లో బంధించాడు. రెండు రోజుల పాటు బాలిక మీద నాలుగైదు సార్లు అత్యాచారం చేశాడు.

 Senior Policeman Jailed for 100 years for raping girl in Malaysian

విషయం తెలుసుకున్న సీనియర్ పోలీసు అధికారులు కేసు నమోదు చేశారు. బాధ్యతాయుతమైన హోదాలో ఉంటూ ప్రజలను రక్షించాల్సిన అబ్దుల్ అని బాలిక అని కూడా చూడకుండా పలు సార్లు అత్యాచారం చేశాడని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టులో వాదించారు.

విషయం బయటకు చెబితే చంపేస్తానని బాలికను బెదిరించాడని, బాలిక వయసు దృష్టిలో ఉంచుకోకుండా కిరాతకుడిలాగా ప్రవర్తించాడని కోర్టు గుర్తించింది. అబ్దుల్ అని నేరం చేసినట్లు రుజువు కావడంతో శిక్ష విధించింది. అబ్దుల్ అని పై కోర్టుకు వెళ్లడానికి అవకాశం ఉందని కోర్టు తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+