పెళ్లైన మరుసటి రోజే కోడలిని చంపిన మామ: మరో నలుగుర్నీ కాల్చేశాడు
సెర్బియా: ఓ వ్యక్తి తన కొడుకు పెళ్లి జరిగిన మరుసటి రోజే దారుణానికి పాల్పడ్డాడు. కొత్త కోడలు, తన భార్యను, వారిద్దరి తల్లిదండ్రులను కాల్చి చంపాడు. ఈ ఘటన సెర్బియాలో చోటుచేసుకుంది.
కంజిజా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన భార్యని, ఆమె తల్లిదండ్రులను, కొడుకు భార్యను, ఆమె తల్లిదండ్రులను కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అతను కూడా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు.

బెల్ గ్రేడ్‌కు 185 కిలో మీటర్ల దూరంలోని మార్టొనోస్ గ్రామంలో రడె సెఫెర్ (55) అనే వ్యక్తి ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడని తెలిపారు. కుటుంబ కలహాలే ఈ హత్యలకు కారణమని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
లైసెన్స్‌డ్ తుపాకీతోనే నిందితుడు ఈ హత్యలకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications