Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రష్యాకు వ్యతిరేకంగా భారత్ ఓటు-అంతర్జాతీయ కోర్టులో భారత జడ్డీ షాకింగ్-కేంద్రం వైఖరికి భిన్నంగా

ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర విషయంలో అంతర్జాతీయంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. పశ్చిమ దేశాలతో పాటు భారత్ వంటి దేశాల్లోనూ దీనిపై వ్యతిరేకత ఉంది. అటు రష్యాలోసైతం నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయినా పుతిన్ మాత్రం వెనక్కి తగ్గడంలేదు. అయితే ఈ వ్యవహారంలో తటస్దంగా ఉంటున్నామన్న పేరుతో రష్యాకు ఇప్పటివరకూ సహకరిస్తున్న భారత్ కు అంతర్జాతీయ న్యాయస్ధానంలో స్వయంగా తాము నామినేట్ చేసిన జడ్డీ షాక్ ఇచ్చారు.

రష్యా-ఉక్రెయిన్ పోరుపై భారత్

రష్యా-ఉక్రెయిన్ పోరుపై భారత్

ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర నేపథ్యంలో తలెత్తిన పరిణామాల్ని నిశితంగా గమనిస్తున్నభారత్.. ఇందులో జోక్యం చేసుకునేందుకు మాత్రం నిరాకరిస్తోంది. అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్ అనుసరిస్తున్న తటస్ధ వైఖరి రష్యా-ఉక్రెయిన్ పోరు విషయంలోనూ కొనసాగుతోంది. దీంతో రష్యా చేస్తున్న యుద్ధాన్ని ఖండిస్తూనే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు భారత్ నిరాకరిస్తోంది. ఐరాసతో పాటు ఇతర అంతర్జాతీయ వేదికలపైనా భారత్ ఈ వ్యవహారంలో తటస్ధ రాగమే ఆలపిస్తోంది.

అంతర్జాతీయ కోర్టులో సీన్ రివర్స్

అంతర్జాతీయ కోర్టులో సీన్ రివర్స్

ఇప్పటివరకూ రష్యా-ఉక్రెయిన్ పోరుపై ఐరాస భద్రతా మండలి, సాధారణ సభల్లో జరిగిన పలు సమావేశాలు, తీర్మానాల్లో పాల్గొని తమ అభిప్రాయం చెప్పిన భారత్.. ఓటింగ్ కు మాత్రం దూరంగా ఉండిపోయింది. కానీ తాజాగా అంతర్జాతీయ కోర్టుకు చేరిన ఈ వ్యవహారంలోనూ అలాగే ఉండాలని భావించింది. కానీ భారత్ ఆశల్ని నీరుగారుస్తూ మన న్యాయమూర్తి జస్టిస్ దల్వీర్ భండారీ.. రష్యా దండయాత్రను తప్పుబట్టారు. దీంతో ఇప్పటివరకూ భారత్ చెప్తున్న తటస్ధ వైఖరి డైలాగ్ కు భారీ షాక్ తగిలినట్లయింది.

భారతీయ జడ్డి యూటర్న్

భారతీయ జడ్డి యూటర్న్

హేగ్ లోని అంతర్జాతీయ న్యాయస్ధానంలో ఉక్రెయిన్ పై రష్యా దండయాత్రపై జరిగిన ఓటింగ్ లో భారత్ తన తటస్ధ వైఖరికి భిన్నంగా వ్యతిరేక ఓటు వేసింది. ఐసీజేలో భారత న్యాయమూర్తి జస్టిస్ దల్వీర్ భండారీ రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేశారు. జస్టిస్ భండారీ పూర్తిగా ప్రభుత్వం, వివిధ మిషన్ల మద్దతుతో ఐసీజేకు నామినేట్ అయ్యారు. జస్టిస్ భండారీ రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేయడం, రష్యా-ఉక్రెయిన్ సమస్యపై ఆయన వివరణ ఆధారంగా స్వతంత్ర చర్య అయినప్పటికీ, వివిధ అంతర్జాతీయ వేదికలపై భారతదేశం యొక్క వైఖరి భిన్నంగా ఉన్నట్లు తేలిపోయింది. వాస్తవానికి ఐక్యరాజ్యసమితిలో ఉక్రెయిన్-రష్యా సమస్యపై ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది . యుద్ధానికి బదులుగా చర్చలపై దృష్టి పెట్టాలని, శత్రుత్వాలను ముగించాలని ఇరుపక్షాలను భారత్ గతంలో కోరింది.

యుద్ధం ఆపాలని రష్యాకు ఐసీజే ఆదేశం

యుద్ధం ఆపాలని రష్యాకు ఐసీజే ఆదేశం

ఉక్రెయిన్‌పై రష్యా దాడిపై చర్చించిన ఐక్యరాజ్యసమితి అత్యున్నత న్యాయస్థానం దీన్ని వెంటనే నిలిపేయాలని పుతిన్ ను ఆదేశించింది. రష్యా బలప్రయోగంపై తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని పేర్కొంది. రష్యన్ ఫెడరేషన్ ఉక్రెయిన్ భూభాగంలో ఫిబ్రవరి 24న ప్రారంభించిన సైనిక కార్యకలాపాలను తక్షణమే నిలిపివేస్తుందని అంతర్జాతీయ కోర్టు పేర్కొంది. అయితే ఈ కేసులో తుది నిర్ణయం మాత్రం పెండింగ్‌లో ఉంది. ఫిబ్రవరి 24న రష్యా దాడి తర్వాత ఉక్రెయిన్ .. రష్యాపై అంతర్జాతీయ కోర్టులో ఫిర్యాదు చేసింది. దీనిపై ఐసీజే విచారణ జరుపుతోంది. అయితే రష్యాకు ఈ విచారణ జరిపే పరిధి లేదని రష్యా వాదిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+