ఏడుగురు అమెరికా సైనికులు ఖతం!? గెట్ రెడీ ఫర్ వార్... సైన్యానికి ట్రంప్ సూచన

ఉత్తరకొరియాతో దేశ భద్రతకు ముప్పు వచ్చే పరిస్థితే ఏర్పడితే.. ఆ దేశంపై దాడి చేసేందుకు ఏమాత్రం వెనకాడవద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సైన్యానికి సూచించారు.

వాషింగ్టన్: ఉత్తరకొరియాతో దేశ భద్రతకు ముప్పు వచ్చే పరిస్థితే ఏర్పడితే.. ఆ దేశంపై దాడి చేసేందుకు ఏమాత్రం వెనకాడవద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సైన్యానికి సూచించారు.

అమెరికాతో పాటు దక్షిణ కొరియా కూడా ఉత్తర కొరియాను రెచ్చగొట్టేలా తొలి వ్యాఖ్యలు, చర్యలు వద్దని పేర్కొన్న ట్రంప్, సైన్యం మాత్రం యుద్ధం చేయడానికి ఏ క్షణమైనా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

Seven American Soldiers Died, Get Ready for War, Says Trump

ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రెడీగా ఉండాలని ట్రంప్ తెలిపినట్టు అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి రేటెల్లర్సన్ తెలిపారు. తాము ఎదురుచూస్తున్న సమయం వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు.

మరోవైపు ఉత్తర కొరియా శనివారం నాడు మూడు ఖండాంతర క్షిపణులను ప్రయోగించగా, అవి దక్షిణ కొరియాకు 240 కిలోమీటర్ల దూరంలోని పసిఫిక్ మహా సముద్రంలో పడిన సంగతి తెలిసిందే. జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్న ట్రంప్, ఈ తాజా ప్రయోగాల వెనుక కిమ్ జాంగ్ వ్యూహంపై అడిగి తెలుసుకున్నట్టు 'న్యూయార్క్ టైమ్స్' తెలిపింది.

ఏడుగురు అమెరికా సైనికులు హతం?

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఏడుగురు అమెరికా సైనికులను చంపేసినట్లు ఉత్తరకొరియా అధికార మీడియా అరిరేంజ్ మేరి ప్రకటించింది. ఒక అమెరికా సబ్‌మెరెన్‌పై ఉత్తరకొరియా సైన్యం జరిపిన దాడిలో ఆ ఏడుగురు అమెరికా సైనికులు హతమయ్యారట.

అయితే కిమ్ చంపింది అమెరికా సైనికులనే కానీ, నిజమైన వారిని కాదు. 'హంటింగ్ యాంకీ' అనే 3డీ గేమ్ లాంచింగ్ సందర్భంగా కిమ్ స్వయంగా గేమ్ ఆడారని, అందులో ఒక అమెరికా సబ్‌మెరెన్‌ను ఆయన ధ్వంసం చేశారని ఉత్తరకొరియా అధికార మీడియా అరిరేంజ్ మేరిచెబుతోంది.

ఆ సబ్‌మెరెన్‌ లో ఉన్న ఏడుగురు సైనికులను కిమ్ అంతమొందించారని అరిరేంజ్ మేరి వివరించింది. ఉత్తరకొరియా, అమెరికాల మధ్య ఉద్రిక్త పరిస్థితులను క్యాష్ చేసుకునేందుకు ఉత్తరకొరియాకు చెందిన ఒక సంస్థ ఈ గేమ్‌ను రూపొందించింది.

నిజంగా అమెరికా సైనికులను చంపుతున్న భావనను ప్రజలకు కలిగించి వారిలో దైర్యాన్ని నింపేందుకు ఈ ప్రయత్నం చేశామని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. మరోవైపు ఈ తరహా గేమ్‌ రూపకల్పనపై అమెరికా మండిపడింది. అమాయకులైన ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టొద్దని, అలాంటి ప్రయత్నాలు వెంటనే మానుకోవాలని కిమ్ కు హితవు పలికింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+