భయానకం: దొరికినవారిని దొరికినట్లు గొడ్డలితో నరికాడు

జర్మనీలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి రైల్వే స్టేషన్‌లోకి ప్రవేశించి దొరికినవారిని దొరికినట్లు నరికాడు. దీంతో భయానక వాతావరణం నెలకొంది.

జర్మనీ: జర్మనీలోని రైల్వే స్టేషన్‌లో ఓ వ్యక్తి దొరికినవారిని దొరికినట్లు గొడ్డలితో నరికాడు. రైల్వే స్టేషన్‌లోకి చొరబడి ఓ వ్యక్తి గొడ్డలితో రెచ్చిపోయాడు. అత్యంత రాక్షసంగా వ్యవహరించాదడు. ఈ దాడిలో దాదాపు ఏడుగురు గాయపడ్డారు. జర్మనీలోని డస్సెల్‌డార్ఫ్ నగరంలోని ప్రధాన రైల్వే స్టేషన్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది.

గతంలో కూడా ఇక్కడ ఇలాంటి దాడులు జరిగాయి. అలా దాడులు చేసినవారిని పోలీసులు అరెస్టు చేశారు. గురువారం రాత్రి యుగోస్లోవియాకు చెందిన ఓ వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు. దాదాపు 36 ఏళ్ల వయస్సు గల ఆ వ్యక్తి మానసిక పరిస్థితి బాగా లేదని భావిస్తున్నారు.

Seven injured after man attacks passengers at random in railway station

రాత్రి 8.50 గంటల ప్రాంతంలో రైల్వే స్టేషన్‌లోకి గొడ్డలితో ప్రవేశించి దాడి చేశాడు. పోలీసులు అక్కడికి చేరుకోవడంతో వారిని చూసి అతను పెద్ద గోడ దూకి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో అతను గాయపడ్డాడు.

పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే, అతని మానసిక పరిస్థితి విచారించడానికి వీలు కల్పించడం లేదని, మానసికంగా తీవ్రంగా దెబ్బ తిన్నట్లు తమకు అర్థమైందని పోలీసులు అంటున్నారు. ఈ సంఘటనతో రైల్వే స్టేషన్ ఆవరణలో భయానక వాతావరణం నెలకొంది. ఎక్కిడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. రైల్వే స్టేషన్‌లో ఎక్కడ చూసినా రక్తం మరకలే కనిపించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+