న్యూయార్క్‌లో హాహాకారాలు: నైట్ క్లబ్‌లో మాస్ షూటింగ్: 11 మంది మృతి: యూఎస్‌లో ఏం జరుగుతోంది?
Tesla Cybertruck: కొత్త సంవత్సరం తొలి రోజున అగ్రరాజ్యం అమెరికా అనూహ్య సంఘటనలు చోటు చేసుకుంటోన్నాయి. వరుస ఘటనలతో భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. తొలుత- లూసియానాలోని న్యూ ఆర్లిన్స్ సిటీలో ఐసిస్ ఉగ్రవాది సృష్టించిన కారు ప్రమాదంలో 15 మంది దుర్మరణం పాలయ్యారు.
క్రిక్కిరిసిన బోర్బన్ స్ట్రీట్‌లో ఫోర్డ్ పికప్ ట్రక్‌తో విధ్వంసాన్న సృష్టించాడు. కనిపించిన వారిని కనిపించినట్టే తొక్కుకుంటూ వెళ్లాడు. అనంతరం తుపాకీతో యథేచ్ఛగా కాల్పులు జరిపాడు. ఆ ఉగ్రవాదిని టెక్సాస్‌కు చెందిన షంషుద్-దిన్ జబ్బార్‌గా గుర్తించారు. ఆ వాహనంపై ఐసిస్ జెండా ఉన్నట్లు నిర్ధారించారు.

దీని నుంచి తేరుకోకముందే లాస్ వెగాస్‌లో మరో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. టెస్లాకు చెందిన సైబర్‌ట్రక్ మంటలబారిన పడింది. పేలిపోయింది. అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌కు సంస్థ.. టెస్లా. ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసే కంపెనీ ఇది. గత ఏడాది సైబర్‌ట్రక్‌ను అభివృద్ధి చేసింది.
ఈ ట్రక్- లాస్ వెగాస్‌లో పేలిపోయింది. మంటల బారిన పడింది. అది కూడా ఆ దేశాధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన హోటల్ వద్ద కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఘటనలో ఒకరు దుర్మరణం పాలయ్యారు. ఏడుమంది గాయపడ్డారు. దీనిపై అధ్యక్షుడు జో బైడెన్ సైతం స్పందించారు. దీన్ని ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు.
అదే సమయంలో న్యూయార్క్‌లో భయానక ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఓ నైట్ క్లబ్‌లో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 11 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నందు వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం లేకపోలేదని తెలుస్తోంది.
న్యూయార్క్ క్వీన్స్ ప్రాంతంలోని అమెజురా నైట్ క్లబ్‌లో ఈ ఘటన సంభవించింది. కొత్త సంవత్సరం వేడుకల్లో మునిగిపోయిన సమయంలో ఒక్కసారిగా బుల్లెట్ల వర్షం కురిసిందక్కడి వారిపై. 11 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన స్థలం మొత్తం రక్తసిక్తమైంది. రక్తమోడింది.
🚨 #BREAKING: MASS SHOOTING IN NEW YORK CITY
— Nick Sortor (@nicksortor) January 2, 2025
At least 11 people have been shot in Queens, NY at Amazura Night Club
This is still an ACTIVE situation. pic.twitter.com/HFYY0Cb3qZ
క్వీన్స్ ఏరియాలోని 91-12 144, జమైకా స్ట్రీట్‌లో ఉందీ అమెజురా నైట్ క్లబ్. కొత్త ఏడాదిని పురస్కరించుకుని హైఎండ్ పార్టీ ఏర్పాటైందిక్కడ. డీజే సౌండ్స్, లైవ్ పెర్‌ఫార్మెన్స్, మ్యూజిక్ కన్సర్ట్, కాక్‌టైల్‌ను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఫుల్ జోష్‌లో పార్టీ కొనసాగుతున్న సమయంలో ఒక్కసారిగా తుపాకి పేలింది.
ఈ ఘాతుకానికి పాల్పడింది ఎవరనేది ఇంకా తెలియరావట్లేదు. దీని వెనుక ఉగ్రవాద కోణ ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి.
సమాచారం అందిన వెంటనే న్యూయార్క్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. సమగ్ర దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications