ఆయన వల్ల సెక్స్ వర్కర్‌గా మానేశా, అతనితో గడిపా, వాటా కావాలి!
సిడ్నీ: ఆస్ట్రేలియాలోని సిడ్నీలో గల ఓ సెక్స్ వర్కర్ తన కస్టమర్ ఆస్తిలో వాటా కోరుకోవడం గమనార్హం. తన కస్టమర్‌కు చెందిన రెండు మిలియన్ల డాలర్ల వాటాలో తనకు పావు శాతం ఇవ్వాలని అంటోంది. న్యాయపరమైన అంశాల కారణంగా ఆమె పేరును వెల్లడించలేదు.
తనకు తన కస్టమర్ పావుశాతం వాటా ఇవ్వాలని ఆమె కోర్టుకు ఎక్కింది. అతనితో కలిశాక తాను తన వ్యభిచార వృత్తిని మానేశానని, తద్వారా తన ఆదాయాన్ని కోల్పోయానని చెప్పింది.

ఈ జంట 1999లో మొదటిసారి కలిసింది. ఆ సమయంలో ఆమె వయస్సు 30. అతని వయస్సు 40 ఏళ్లు. ఓ సందర్భంలో అతను తన పైన వందలాది డాలర్ల నోట్లు గుమ్మరించాడని తెలిపింది. ఏడాది అనంతరం తమ మధ్య రిలేషన్‌షిప్ ఏర్పడిందని, ఆ తర్వాత తన వద్దకు ఎప్పుడు వచ్చిన అతను డబ్బులు ఇవ్వలేదని చెప్పింది.
ఆయన కారణంగా తాను తన పడుపు వృత్తిని మానేశానని, ఈ నేపథ్యంలో తనకు వాటా ఇచ్చేవిధంగా చూడాలని ఆమె న్యాయస్థానాన్ని కోరింది. తాను పడుపు వృత్తి మానేశాక చాలా రోజుల పాటు అతని సొంతింటిలో గడిపానని చెప్పింది. తాను అండగా ఉంటానని, పడుపు వృత్తి మానుకోవాలని తనకు చెప్పాడని తెలిపింది. అందువల్ల తనకు వాటా ఇప్పించాలని కోరింది.












Click it and Unblock the Notifications