షారుక్ ఖాన్! పాకిస్తాన్ వచ్చెయ్: తీవ్రవాది ఆహ్వానం
కరాచీ: భారత దేశంలో మతఅసహనం పైన బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ చేసిన వ్యాఖ్యలకు విశ్వహిందూ పరిషత్ నేతలు మంగళవారం కౌంటర్ ఇచ్చారు. షారుక్ పాక్ వెళ్లవచ్చునని, ఆయన ఇక్కడున్నా ఆయన మనసు మాత్రం పాకిస్తాన్‌లో ఉందని ధ్వజమెత్తారు.
ఈ నేపథ్యంలో షారుక్ ఖాన్‌కు అనుకోని ఆహ్వానం వచ్చింది. పాకిస్తాన్‌లో షారుక్ ఉండవచ్చునని ఓ మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది హఫీజ్ సయీద్ నుంచి పిలుపు వచ్చింది. క్రీడలు, కళలు, విద్య తదితరాల్లో ఎంతో పేరు తెచ్చుకున్న భారత ముస్లింలు తమ గుర్తింపు కోసం నిత్యమూ యుద్ధం చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నాడు.
షారుక్ ఖాన్ సహా ఎవరైనా ముస్లిం, ఇస్లాం కారణంగా భారత దేశంలో కష్టంగా ఉందని భావిస్తే, వారు పాకిస్థాన్‌కు వచ్చి నివాసం ఏర్పరుచుకుంటే స్వాగతిస్తున్నామని సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో పోస్ట్ పెట్టాడు.

షారుక్ ఖాన్ పైన బిజెపి నేతలు సైతం మండిపడ్డారు. షారుక్ ఖాన్ భారత్‌లో ఉన్నా మనసంతా పాక్ పైనే అని బిజెపి నాయకుడు కైలాశ్ విజయ్ వర్గీయా మండిపడ్డారు. సోమవారం షారుక్ మాట్లాడుతూ.. సినీ రంగానికి చెందిన వారు, శాస్త్రవేత్తలు, రచయితలు అవార్డులు వెనక్కి ఇవ్వడాన్ని సమర్థిస్తున్నట్లు చెప్పారు.
వెనక్కి ఇవ్వడానికి తనకు జాతీయ ఫిల్మ్ అవార్డు ఏమీ లేదని, అలా చేసిన సినీ ప్రముఖులు దివాకర్ బెనర్జీ, ఆనంద్ పట్వర్దన్‌ల నిర్ణయాన్ని తాను గౌరవిస్తానని చెప్పారు. సృజన పట్ల, మతం పట్ల అసహనం ప్రదర్శిస్తున్నామంటే దేశం వేసిన ప్రతి ముందడుగు వెనక్కి లాగుతున్ననట్లే అన్నారు.
Even the renowned Indian Muslims in the field of sports,academia, arts & culture are fighting a constant battle for identity inside India -4
— Hafiz Muhammad Saeed (@HafizSaeedJUD01) November 3, 2015 Any such Muslim, even Shahrukh who is facing difficulty and discrimination in India because of Islam are invited to stay in Pakistan - End
— Hafiz Muhammad Saeed (@HafizSaeedJUD01) November 3, 2015 











Click it and Unblock the Notifications