పాక్ అపద్ధర్మ ప్రధానిగా షాహీద్ అబ్బాసీ!
పాకిస్తాన్ అపద్ధర్మ ప్రధానిగా షాహీద్ అబ్బాసీని ఎన్నిక చేసినట్లు తెలుస్తుంది. అబ్బాసీ గతంలో పెట్రోలియం శాఖ మంత్రిగా పని చేశారు. నవాజ్ షరీఫ్‌పై అనర్హత వేటుతో షాహీద్‌ను అపద్ధర్మ ప్రధానిగా నియామకం చేసినట్
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ అపద్ధర్మ ప్రధానిగా షాహీద్ అబ్బాసీని ఎన్నిక చేసినట్లు తెలుస్తుంది. అబ్బాసీ గతంలో పెట్రోలియం శాఖ మంత్రిగా పని చేశారు. నవాజ్ షరీఫ్‌పై అనర్హత వేటుతో షాహీద్‌ను అపద్ధర్మ ప్రధానిగా నియామకం చేసినట్లు సమాచారం.
45 రోజుల పాటు పాక్ అపద్ధర్మ ప్రధానిగా అబ్బాసీ పని చేయనున్నారు. నవాజ్ సోదరుడు షాబాజ్ ఎంపీగా ఎన్నికయ్యే వరకు అబ్బాసీ ప్రధానిగా కొనసాగుతారని పాక్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

పనామా గేట్ కుంభకోణంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్‌షరీఫ్‌కు ఆ దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనను ప్రధాని పదవికి అనర్హుడిగా ప్రకటిస్తూ పాక్ సుప్రీంకోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.
షరీఫ్‌తోపాటు, ఆయన కుటుంబ సభ్యులు పనామా గేట్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఆరుగురు సభ్యుల సంయుక్త దర్యాప్తు బృందం (జిట్) జూలై 10న సమర్పించిన నివేదిక ఆధారంగా పాక్ సర్వోన్నత న్యాయస్థానం నవాజ్‌షరీఫ్‌ను దోషిగా తేల్చింది. షరీఫ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది.
'పాక్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 62, 63 ప్రకారం పార్లమెంటులో నిజాయితీగల సభ్యుడిగా కొనసాగేందుకు షరీఫ్‌కు అర్హత లేదు. ఆయన ఇక ప్రధానిగా కొనసాగడానికి వీల్లేదు..' అని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పును జస్టిస్ ఇజాజ్ అఫ్జల్‌ఖాన్ చదివి వినిపించారు.
ఇదే కేసులో షరీఫ్‌తోపాటు ఆయన ఆనుచరుడు, పాకిస్తాన్ ఆర్థిక మంత్రి ఇషాక్‌దార్‌ను, జాతీయ అసెంబ్లీ సభ్యుడు, షరీఫ్ అల్లుడు మహమ్మద్ సఫ్దార్‌లను కూడా సుప్రీంకోర్టు అనర్హులుగా ప్రకటించింది.












Click it and Unblock the Notifications