భారత్ కు పాకిస్థాన్ ప్రధాని మరోసారి వార్నింగ్.. COP31 వేదికగా..!

భారత్- పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకున్న సంగతి తెలిసిందే. గతేడాది ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్ర స్థావరాలపై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. అలాగే వందలాదిమంది ఉగ్రవాదులను హతమార్చింది. అంతేకాక పాకిస్థాన్ పై భారత్ అనేక ఆంక్షలను విధించింది. వాటిల్లో సింధూ జలాల పంపిణీ నిలిపివేత కూడా ఒకటి. అయితే భారత్ ఈ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పలు అంతర్జాతీయ వేదికలపై ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ వేదికలపై భారత్ వైఖరిని ప్రస్తావించి తద్వారా భారత్ పై దౌత్యపరమైన ఇబ్బందులను సృష్టించాలని పాకిస్థాన్ యత్నిస్తోంది.

తాజాగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. వాతావరణ మార్పులపై జరిగిన కాన్ఫెరెన్స్ ఆఫ్ పార్టీస్(COP) 31 అంతర్జాతీయ సమ్మిట్ లో మరోసారి సింధూ జలాల నిలిపివేత అంశాన్ని ప్రస్తావించారు. నీటిని ఆయుధంగా వాడుకోవద్దని.. రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోకూడదని స్పష్టం చేశారు. అలాగే దేశాల మధ్య కుదిరిన నీటి పంపిణీ ఒప్పందాలను గౌరవించుకోవాలని స్పష్టం చేశారు. ఈ మేరకు పాకిస్థాన్ ప్రధాని మరోసారి అంతర్జాతీయ వేదికపై భారత్ లక్ష్యంగా పరోక్ష వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు వాతావరణ మార్పుల కారణంగా సంక్షోభంలోకి వెళ్తున్న పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలను అభిృద్ధి చెందిన దేశాలు ఆదుకోవాలని పేర్కొన్నారు. ఈ మేరకు పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు సహాయాన్ని అప్పుల రూపంలో కాకుండా గ్రాంట్స్ రూపంలో ఇవ్వాలని కోరారు.

ShehbazSharif Pakistan PM issues another warning India at COP31 summit Do not use water as a weapon

ఇక భారత్ - పాకిస్థాన్ మధ్య 1960 లో వరల్డ్ బ్యాంక్ సమక్షంలో సింధు నదీ జలాల ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం ప్రకారం భారత్ కు రావి, బియాస్, సట్లెజ్ నదులను కేటాయించగా అటు పాకిస్థాన్ కు సింధు, జీలం, చీనాబ్ నదుల జలాలను కేటాయించారు. అయితే గతేడాది జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి కారణంగా ఆ దేశానికి నీటి సరఫరాను నిలిపివేస్తూ భారత్ కీలక నిర్ణయం తీసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+