భారత్ చేతిలో Sheikh Hasina తలరాత: మోదీ విచక్షణాధికారాలు ప్రయోగిస్తారా?
Sheikh Hasina's Extradition: పదవీచ్యుతురాలైన బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాకు మరణ శిక్ష పడింది. ఈ మేరకు ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రిబ్యునల్ (ICT) కోర్టు తుది తీర్పు వెలువడించింది. 2024 జులై- ఆగస్టు మధ్య సంభవించిన హింసాత్మక నిరసనల ప్రదర్శనలకు ఆమెను బాధ్యురాలిగా గుర్తించింది న్యాయస్థానం. అప్పట్లో ఈ అల్లర్లల్లో 1,400 మందికి పైగా మరణించారు. వారందరి మరణానికీ షేక్ హసీనా బాధ్యురాలని తేల్చి చెప్పింది.
ప్రస్తుతం షేక్ హసీనా భారత్ లో తలదాచుకుంటోన్నందున.. తీర్పు వెలువడిన వెంటనే బంగ్లాదేశ్ ప్రభుత్వం తన దౌత్య ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఆమెను తమకు అప్పగించాలని కోరుతోంది. దీనికి సంబంధించి.. విదేశాంగ మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు మొదలు పెట్టింది. ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రిబ్యునల్ (ICT) ప్రత్యేక కోర్టు తీర్పును గౌరవిస్తూ హసీనాను తమకు అప్పగించాలని కోరుతోంది బంగ్లాదేశ్.ఇప్పుడిక- ఆమె భవితవ్యం ఏమిటనేది భారత్ చేతిలో ఉంది. హసీనాను అప్పగిస్తుందా అనేది చర్చనీయాంశమౌతోంది.

షేక్ హసీనా హయాంలో భారత్- బంగ్లాదేశ్ మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగిన విషయం తెలిసిందే. 15 ఏళ్ల హసీనా పరిపాలనలో ఆమెకు అన్నిరకాలుగా మద్దతు ఇచ్చింది. 1975లో ఆమె కుటుంబం హత్యకు గురైన తర్వాత, అంతకుముందు బహిష్కరణ వేటు పడ్డప్పుడూ భారత్ ఆశ్రయం కల్పించింది. ఆమె ప్రధానిగా ఉన్నప్పుడు, భారత్- బంగ్లాదేశ్ మధ్య బలమైన దౌత్య, వ్యూహాత్మక, వాణిజ్య సంబంధాలు కొనసాగాయి. 2017 అదానీ విద్యుత్ సరఫరా ఒప్పందం బంగ్లాదేశ్‌లో న్యూఢిల్లీ ఆర్థిక స్థానాన్ని పటిష్టం చేసింది. ఆమె హయాంలో ప్రధాని మోదీ బంగ్లాదేశ్ లో పర్యటించారు కూడా.
యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వం అధికారిక అప్పగింతను కోరడానికి ఇప్పటివరకూ నిరాకరిస్తూ వచ్చింది. భారత్ నుంచి ఆమెను పిలిపించుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. మరణశిక్ష పడటంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో హసీనా అప్పగింత కోసం భారత్ పై యూనుస్ ప్రభుత్వం ఒత్తిడిని తీసుకుని రావడం ఖాయంగా కనిపిస్తోంది.
- ఈ పరిణామాల మధ్య.. భారత్- బంగ్లాదేశ్ మధ్య కుదిరిన అప్పగింత ఒప్పందాలు తెరమీదికి వచ్చాయి. 2013లో ఈ రెండు దేశాలు అప్పగింత ఒప్పందాలపై సంతకాలు చేశాయి. సరిహద్దు ఉగ్రవాదం, తిరుగుబాటును పరిష్కరించడానికి 2016లో దీన్ని సవరించారు.
- డ్యూయల్ క్రిమినాలిటీ: అప్పగింతకు గురయ్యే వ్యక్తి.. రెండు దేశాల్లో శిక్షార్హమై ఉన్న నేరాలను ఎదుర్కొంటూ ఉండాలి. కనీసం ఒక సంవత్సరం శిక్ష విధించే నేరాలకు అప్పగింత వర్తిస్తుంది.
- అరెస్ట్ వారెంట్: 2016 సవరణ తర్వాత.. డ్యూయల్ క్రిమినాలిటీ క్లాజ్ ను మరింత సరళీకరించారు. కోర్టు జారీ చేసిన అరెస్ట్ వారెంట్ సరిపోతుంది.
- రాజకీయ నేరాలపై నిషేధం: రాజకీయ నేరాలకు సంబంధించిన అభ్యర్థనలను తిరస్కరించే వెసలుబాటు రెండు దేశాలకూ ఉంది. హత్య, ఉగ్రవాదం, కిడ్నాప్ వంటి నేరాలు దీనికి వర్తించవు. వీటిని మినహాయించారు.
- ఒప్పందాలు ఉన్నప్పటికీ కూడా అప్పగింతను తిరస్కరించడానికి భారత్‌కు చట్టపరమైన విచక్షణ ఉంది.
- షేక్ హసీనా ఎదుర్కొంటోన్న ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమైనవనని భారత్ నిర్ధారణకు వస్తే.. ఆమె అప్పగింతను తిరస్కరించవచ్చు. సరైన విచారణ లేకుండా హసీనా మరణశిక్షను ఎదుర్కొంటున్నట్లు భారత్ భావిస్తే.. మానవ హక్కుల కారణాలతో అప్పగింతను తిరస్కరించడానికి అవకాశం ఉంది.
- క్రిమినల్ ట్రిబ్యునల్ విచారణలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా లేదని భారత్ వాదించవచ్చు. హసీనా రాజకీయ ప్రతీకార చర్యలకు గురవుతున్నారని భారత్ విశ్వసించినా అప్పగింతను నిరాకరించవచ్చు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications