Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Miss Universe 2023: టైటిల్.. ఆ అందగత్తెకే: మొట్ట మొదటిసారిగా

సాన్ సాల్వెడార్: మిస్ యూనివర్స్ 2023 (Miss Universe 2023) విజేత ఎవరో తేలిపోయింది. సెంట్రల్ అమెరికాలోని ఎల్ సాల్వెడార్ (El Salvador)లో కలర్‌ఫుల్‌గా సాగిన కార్యక్రమంలో నిర్వాహకులు ఈ క్రౌన్ విన్నర్ పేరును ప్రకటించారు. మిస్ యూనివర్స్ చరిత్రలో మొట్టమొదటిసాగా తన దేశానికి మిస్ యూనివర్స్ కిరీటాన్ని అందజేసిందా యువతి.

ఆమె పేరు- షెయిన్నిస్ అలోండ్రా పాలాసియోస్ కార్నెజొ (heynnis Alondra Palacios Cornejo). నికరగ్వా (Nicaragua)కు చెందిన అమ్మాయి. భారత కాలమానం ప్రకారం- ఈ ఉదయం ఎల్ సాల్వెడార్ రాజధాని సాన్ సాల్వెడార్‌లో గల జోస్ అడాల్ఫొ పినెడా ఎరీనాలో జరిగిన కార్యక్రమంలో షెయిన్నిస్ పేరును ప్రకటించారు నిర్వాహకులు.

Sheynnis Alondra Palacios from Nicaragua was crowned the Miss Universe 2023

మిస్ యూనివర్స్ 2022, అమెరికాకు చెందిన ఆర్ బొన్నీ గాబ్రియేల్ చేతుల మీదుగా మిస్ యూనివర్స్ 2023 కిరీటాన్ని ధరించారు. ఆస్ట్రేలియాకు చెందిన మొరాయా విల్సన్ (Moraya Wilson), థాయ్‌లాండ్ బ్యూటీ అంటొనియా పొర్సిల్డ్ (Anntonia Porsild) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.

ఈ మిస్ యూనివర్స్ కోసం భారత్‌ తరఫున శ్వేతా శారద (Shweta Sharda) పాల్గొన్నారు. ఆమె నిరాశ పరిచారు. చండీగఢ్‌కు చెందిన ఈ అమ్మాయి తొలి 10 స్థానాల్లో చోటు దక్కించుకోలేకపోయింది. ఈ అందగత్తెల పోటీలో ఆమె 20వ స్థానంలో నిలిచింది. ఈ పోటీల్లో మొట్టమొదటిసారిగా పాకిస్తాన్ కూెడా పాల్గొనడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Sheynnis Alondra Palacios from Nicaragua was crowned the Miss Universe 2023

72 సంవత్సరాల మిస్ యూనివర్స్ పోటీల్లో నికరగ్వా యువతికి ఈ టైటిల్ దక్కడం ఇదే తొలిసారి. అదే సమయంలో పాకిస్తాన్ కూడా ఇందులో ప్రాతినిథ్యాన్ని వహించింది. కాగా- మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్‌లల్లో గతంలో భారత్ హవా నడిచింది. ఐశ్వర్య రాయ్, సుస్మిత సేన్, లారా దత్తా, ప్రియాంక చోప్రా, రోహిత్ ఖండెల్వాల్.. ఈ టైటిల్‌ను గెలుచుకున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+