పాక్ నటి సనా జావెద్ తో షోయబ్ మాలిక్ వివాహం..!!
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ రెండో పెళ్లి చేసుకున్నాడు. భారత మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో విడాకుల వార్తల నేపథ్యంలో తన వివాహం గురించి షోయబ్ స్వయంగా వెల్లడించాడు. పాక్‌కు చెందిన నటి సనా జావెద్‌ను వివాహం చేసుకున్నాడు. తమ పెండ్లి వేడుక ఫొటోలను షోయబ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. సానియాకు మాలిక్ విడాకులు ఇచ్చాడా, లేదా అనేది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. షోయబ్ పెళ్లి వార్త వైరల్ అవుతోంది.
మాలిక్ రెండో పెళ్లి: పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ రెండో పెళ్లి చేసుకున్నాడు. భారత మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో విడాకులు తీసుకున్నాడనే వార్తలు వస్తున్న తరుణంలోనే అతడు పెళ్లి చేసుకోవడం గమనార్హం. పాకిస్తాన్ నటి సనా జావేద్‌ను అతడు వివాహం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను స్వయంగా అతడే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.

షోయెబ్ మాలిక్, సానియా మిర్జా వివాహం 2010లో దుబాయ్‌లో ఘనంగా జరిగింది. 2018లో వీరికి ఇజాన్ అనే కుమారుడు జన్మించాడు. అయితే.. గత రెండు సంవత్సరాలుగా సానియా, షోయబ్‌లు వేరువేరుగా ఉంటున్నారని, ఇటీవలే వీరిద్దరు విడాకులు తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే వీటిని ఇటు సానియాగానీ, అటు షోయబ్ గానీ ధ్రువీకరించలేదు. వీళ్లిద్దరూ ది మీర్జా మాలిక్ షో లో కలిసి నటించారు.
సనాతో వివాహం: షోయబ్ మాలిక్ వివాహం చేుకున్న సనా జావేద్ పాకిస్తాన్ ప్రముఖ నటీమణులలో ఒకరు. 28 ఏళ్ల సనా అనేక టీవీ షోల్లో కనిపించింది. 'ఏ ముష్త్-ఎ-ఖాన్', 'డంక్' అనే షోలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి. అంతేకాదు ఆమె చాలా మ్యూజిక్ వీడియోలలో కనిపించింది. 2020లో ఆమె ఉమైర్ జస్వాల్‌ను వివాహం చేసుకుంది. కొద్దికాలానికే ఈ దంపతుల మధ్య పొరపచ్చాలు వచ్చాయి.
వీరిద్దరు తమ తమ సోషల్ మీడియా ఖాతాల నుంచి ఒకరి ఫోటోలను మరొకరు డిలీట్ చేశారు. దీంతో ఈ ఇద్దరూ వీడాకులు తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు షోయబ్ తాజాగా సనాతో తన పెళ్లి వార్తను నిర్దారించాడు. విడాకుల వార్తల మధ్య సానియా మీర్జా బుధవారం సానియా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక కోట్‌ను పంచుకుంది.
- Alhamdullilah ♥️
— Shoaib Malik 🇵🇰 (@realshoaibmalik) January 20, 2024
"And We created you in pairs" وَخَلَقْنَاكُمْ أَزْوَاجًا pic.twitter.com/nPzKYYvTcV
విడాకులు ఇచ్చాడా: అందులో ఎక్కడా విడాకుల అంశం ప్రస్తావన లేకుండానే..చెప్పదలచుకున్నది స్పష్టం చేసింది. పెళ్లి కష్టమా.. విడాకులు తీసుకోవడం కష్టమా..?..ఊబకాయం కష్టమా.. ఫిట్‌గా ఉండటం కష్టమా..?..అప్పులు చేయడం కష్టమా.. ఆర్థికంగా క్రమశిక్షణతో ఉండటం కష్టమా..?..కమ్యూనికేషన్ కష్టమా. కమ్యూనికేట్ చేయకపోవడం కష్టమా..?..అంటూ వీటిలో మీరు వేటిని ఎంచుకుంటారు.
జీవితం ఎప్పుడూ సులభంగా ఉండదు. ఎల్లప్పుడూ కష్టంగానే ఉంటుంది. అయితే.. అది మన చేతుల్లోనే ఉంటుంది. మనం తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలి అనే కోట్‌ను సానియా పంచుకుంది. ఇప్పుడు షోయబ్ మాలిక్ రెండో పెళ్లి చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించాడు.
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications