షాక్: తల్లి లవర్ గన్తో అక్కని కాల్చేసిన రెండేళ్ల పిల్లాడు
వాషింగ్టన్: అమెరికాలో దారుణం జరిగింది. ఓ రెండేళ్ల పిల్లాడి చేతిలో హ్యాండ్ గన్ పేలడంతో అతని పదకొండేళ్ల సోదరి మృతి చెందింది. ఈ సంఘటన పిలడెల్పియాలోని ఓ ఇంట్లో జరిగింది. ఈ ఘటన జరిగిప్పుడు పిల్లలు బెడ్ రూంలో ఉండగా... వారి తల్లి బాత్ రూంలో ఉన్నారు. ఈ ఘటనలో పదకొండేళ్ల జమరా స్టీవెన్స్ మృతి చెందింది.
జమారా స్టీవెన్స్ తన ముగ్గురు తోబుట్టువులతో కలిసి బెడ్ రూంలో ఎ.357 కాలిబర్ హ్యాండ్ గన్తో ఆడుకుంటోంది. అప్పుడు తల్లి టిఫనీ గోల్డ్ వైర్ వారితోనే ఉన్నారు. కాసేపటికి ఆమె బాత్ రూం వెళ్లింది. ఆ సమయంలో లోడ్ అయి ఉన్న గన్ వారి చేతిలో ఉంది. దానిని ఆ తల్లి బాయ్ ఫ్రెండ్ ఉదయం అక్కడ పెట్టి పోయినట్లుగా తెలుస్తోంది.
ఈ గన్తో వారు ఆడుతుండగా... రెండేళ్ల బాలుడు ఆ గన్ తీసుకొని తన పదకొండేళ్ల సోదరి వైపుకు పెట్టి కాల్చాడు. దీంతో బుల్లెట్ ఆమె చాతిలో నుండి దూసుకెళ్లింది. ఆమెను వెంటనే పిలడెల్పియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెను పరిశీలించిన వైద్యులు మృతి చెందినట్లుగా ధృవీకరించారు.