చూస్తుండగానే హెలికాప్టర్ కుప్పకూలింది(వీడియో)
న్యూయార్క్: హవాయిలోని పెర్ల్‌హార్బర్ పర్యాటక కేంద్రం వద్ద ఓ హెలికాప్టర్ అందరూ చూస్తుండగానే నీటిలో కుప్పకూలిపోయింది. ఈ ఘటనను ఓ పర్యాటకుడు తన కెమెరాలో బంధించాడు.
హెలికాప్టర్ ఆకాశంలో ఎగురుతూ నీటిలో కుప్పకూలే వరకూ.. ఆ దృశ్యాలు అతని కెమెరాలో రికార్డయ్యాయి. మాడిసన్ నుంచి శాన్ విన్‌రిచ్ అనే పర్యాటకుడు పెర్ల్‌హార్బర్‌ను చూసేందుకు వచ్చాడు. అక్కడి అందమైన ప్రదేశాలను తన కెమెరాతో ఫొటోలు తీస్తున్నాడు.

కాగా, ఇంతలో ఆకాశంలో ఓ హెలికాప్టర్ తమ వైపే వస్తుండటాన్ని గమనించాడు. వెంటనే తన కెమెరాలో వీడియో మోడ్‌ను ఆన్ చేసి ఆ దృశ్యాన్ని రికార్డు చేయడం ప్రారంభించాడు. అయితే హెలికాప్టర్ అకస్మాత్తుగా కుదుపులకు గురై నీటిలో కుప్పకూలింది.
ఆ ఘటనను చూసి ఒక్కసారిగా భయాందోళనకు గురైన శాన్ వీడియో రికార్డు చేయటం ఆపేశాడు. కాగా, హెలికాప్టర్‌లో ఉన్న ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. వీరిలో 15ఏళ్ల బాలుడుకి తీవ్రగాయాలు కావడంతో అతని పరిస్థితి విషమంగా ఉందని అతనికి చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications