గుండెలదిరిపోయాయ్!: కదులుతున్న బస్సు రెండుగా చీలింది(వీడియో)
దక్షిణ బ్రెజిల్‌లోని పల్‌హోకా ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు ఒక్కసారిగా రెండుగా చీలిపోయింది.
బ్రెజిల్: కదులుతున్న బస్సు గట్టి కుదుపుకు లోనైతేనే గుండెలదిరిపోతాయి. అలాంటిది.. ఉన్నట్టుండి బస్సు రెండుగా చీలిపోతే ఇంకెంత ఆందోళన చెందాలి. ఇటీవల బ్రెజిల్‌లో అచ్చు ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఒక్కసారిగా రెండుగా చీలిపోయింది. అయితే ప్రయాణికులెవరికీ ఏమి కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. దక్షిణ బ్రెజిల్‌లోని పల్‌హోకా ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు ఒక్కసారిగా రెండుగా చీలిపోయింది. చీలిపోయింది వెనుక భాగం కాగా.. ఆ సమయంలో ముందుభాగంలో మాత్రమే కొందరు మహిళలు ఉన్నారు. దీంతో వారెవరికీ ప్రమాదం జరగలేదు. ప్రమాద దృశ్యాలను ఎవరో ప్రయాణికులు వీడియో తీసి ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications