షాక్: మెడపై కాలు, బట్టలిప్పేసి బెల్టుతో కొట్టారు

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని సాయిల్కోట్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కొందరు యువకులు.. ఓ ట్రాన్స్‌జెండర్ మహిళపై తీవ్రంగా దాడి చేశారు. ఆమె మెడపై కాలు వేసి తొక్కుతూ బట్టలు విప్పి బెల్టుతో తీవ్రంగా కొట్టారు. ఆమెపై దాడిలో సుమారు పది మంది పాల్గొన్నట్లు తెలుస్తోంది. అయితే, ఇద్దరు మాత్రం ఆమెను తీవ్రంగా కొట్టారు.

నగరంలోని తమ ఇంట్లో ఉన్న హిజ్రా మహిళపై దాడి చేసిన సదరు యువకులు ఆమెను మంచంపై పడేశారు. ఆ తర్వాత ఆమె మెడపై కాలు వేసి బెల్టుతో కొట్టారు. ఆ తర్వాత ఆమె దుస్తులు విప్పేసి పిరుదులపై బెల్టుతో తీవ్రంగా కొట్టారు. ఆమె బాధతో ఎంత అరుస్తున్నా.. ఆ దుర్మార్గులు ఏమాత్రం కరగలేదు. వద్దని వారించినా అతను వినలేదు. ఆ తర్వాత మరొకడు వచ్చి బెల్టు కొట్టి వెళ్లిపోయాడు.

Shocking moment transgender woman is pinned down and viciously flogged

కాగా, ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఆమెపై దాడికి పాల్పడిన పది మంది వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ పది మందిలో ఐదుగురు మాత్రమే ఆమెపై దాడి చేసి కొట్టారని పోలీసులు తెలిపారు. మిగితా ఐదుగురు ఘటనా స్థలంలో ఉన్నారని చెప్పారు. వారిని విచారిస్తున్నట్లు తెలిపారు. తన చెడు అలవాట్లను మానుకోనందుకే ఆమెను ఇలా శిక్షించామని నిందితులు చెప్పడం గమనార్హం.

కాగా, పాకిస్థాన్‌లో హిజ్రాలపై దాడులు సర్వసాధారణమైపోయాయని హిజ్రాల సంఘం నాయకులు చెబుతున్నారు. తమకు రక్షణ లేకుండా పోయిందని వాపోతున్నారు. సాధారణంగా ఇక్కడి హిజ్రాలు బిక్షమెత్తుకుంటూ, డ్యాన్సులు చేస్తూ, వ్యభిచార కూపాల్లో మగ్గుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+