షాకింగ్: మొబైల్‌లో తలదూర్చి.. ప్రాణాల మీదకు తెచ్చుకుంది(వీడియో)
బీజింగ్: ఫోన్‌లో తలదూర్చారంటే కొంతమంది ప్రపంచాన్నే మరిచిపోతారు. మొబైల్ స్క్రీన్ తప్ప ఇంకేది వారికి పట్టదు. ఫోన్‌కు అంతలా అడిక్ట్ అవడం, మానసికంగాను శారీరకంగాను పెద్ద ముప్పులాగే పరిణమించింది.
ఫోన్ లోనే లీనమై ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఎంతోమంది రోడ్డు ప్రమాదాల్లో మరణించడానికి మొబైల్స్ కూడా కారణమవుతున్నాయి. తాజాగా చైనాకి చెందిన ఓ మహిళ కూడా మొబైల్ లో తలదూర్చి ప్రాణాల మీదకు తెచ్చుకుంది.
ఓ షాపింగ్ మాల్ లో షాపింగ్ ముగించుకుని బయటకొచ్చిన మహిళ.. మొబైల్ ఫోన్ లో తలదూర్చి.. ఎక్కడికి వెళ్తున్నానో కూడా చేసుకోకుండా.. పార్కింగ్ వైపు వెళ్లింది. చైనాలో పార్కింగ్ వ్యవస్థ మన కంటే భిన్నంగా ఉంటుంది. పార్కింగ్ సెక్షన్ లోకి వెళ్లిన కార్లను అక్కడ ఉండే లిఫ్ట్ యంత్రాల ద్వారా కిందకి పంపిస్తారు.
తిరిగి మళ్లీ అదే పద్దతిలో పైకి తీసుకొస్తారు. ఆ మహిళ ఏమరపాటున పార్కింగ్ సెక్షన్ లోకి వెళ్లి.. తీరా ఎక్కడికి వచ్చానో తెలుసుకుని కంగారు పడింది. వెనక్కి వెళ్దామనుకుంటే.. అప్పటికే షట్టర్ క్లోజ్ అయిపోయింది. ఇంతలో లిఫ్ట్ ఆమెను కిందకు తీసుకెళ్లడంతో.. అప్పుడే లిఫ్ట్ మీదకు వస్తున్న ఓ కారు ఆమెను ఢీకొట్టింది.
ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications