వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గర్ల్స్ ఫ్రెండ్‌తో బ్రేకప్: సగానికి కోసేశాడు(వీడియో)

|
Google Oneindia TeluguNews

బెర్లిన్: మన హృదయానికి దగ్గరైన వారు ఎప్పుడూ తిరిగి రాకుండా మన నుంచి దూరమైతే చాలా బాధేస్తుంది. ప్రతీ ఒక్కరూ తమ ఆవేదనను, బాధను తెలుపుకునేందుకు భిన్నమైన చర్యలకు పాల్పడతారు. ఇక్కడ కూడా ఓ వ్యక్తి తన ప్రియురాలు దూరమవడం(బ్రేకప్)తో వింతగా ప్రవర్తించాడు.

భగ్న ప్రేమికుడు ఎప్పుడూ ప్రపంచంలో సంచలనంగా నిలుస్తాడని మరోసారి రుజువు చేశాడు. కొందరు విడిపోయిన ప్రియురాలుపై యాసిడ్ పోయడం, చంపడం లాంటివి చేసి దుర్మర్గులవుతారు. కానీ, జర్మనీకి చెందిన ఈ ప్రేమికుడు అలా చేయలేదు.

ఈ-బేలో డెర్. జులీగా గుర్తింపబడిన అతడు తన వద్ద ఉన్న ఐఫోన్, కారు, టీవీ, మిగితా వస్తువులన్నింటినీ అమ్మేందుకు పెట్టాడు. అయితే ఇందులో ఆశ్చర్యమేంటంటే అవన్నీ రెండు ముక్కలుగా చేసి వున్నవి.

Shocking Video: After break-up with girlfriend, man cuts TV, iPhone, car, all possessions in half

తన ప్రియురాలుతో పంచుకున్న వస్తువులు కాబట్టి.. వాటన్నింటినీ సగానికి సగం కోసేశాడు. శక్తివంతమైన పరికరాన్ని ఉపయోగించి మొబైల్ ఫోన్, సైకిల్, కారు, కుర్చీలు, సోఫా, మంచం, లెటర్ బాక్స్, అల్మరా, ల్యాప్‌టాప్, ఐఫోన్, మిగితా చాలా వస్తువులను సగానికి కోసేశాడు.

కాగా, సగానికి కోసేసిన వస్తువుల్లో సగం అతని ప్రియురాలు తీసుకోగా, మిగితా సగాన్ని అమ్మేసేందుకు ఈబోలే పెట్టాడు ఈ ప్రేమికుడు. అతను వస్తువులను కట్ చేసిన వీడియోను యూట్యూబ్‌లో.. ఆ వీడియో నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోకు ‘ఫర్ లారా' అనే పేరును కూడా పెట్టాడు.

న్యూస్.కామ్.ఏయూ కథనం ప్రకారం.. ఆ వీడియోలో ‘థాంక్యూ లారా.. అందమైన 12 సంవత్సరాలు నాతో గడిపినందుకు. నీవు నిజంగా నాలో సగానివి.' అని ఆ ప్రేమికుడు పేర్కొన్నాడు.

English summary
It hurts when someone close to heart leave us for ever. Everyone reacts in different way when it's come to their break ups with girlfriends and boyfriends.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X