నడిరోడ్డుపై తన్నుకున్న ప్రేమజంట(వీడియో)

న్యూయార్క్: వారిద్దరు ఓ ప్రేమజంట. ప్రేమికులు అప్పుడప్పుడు గొడవ పడటం సాధారణమే. కానీ, ఇక్కడ మాత్రం కాస్త గట్టిగానే గొడవపడ్డారు. అది కూడా నడిరోడ్డుపైనే. మొదట ప్రియురాలు ప్రియుడిపై తన చేతివాటం చూపిస్తే.. ఆ తర్వాత ప్రియుడు తన పంచ్ పవర్ చూపాడు. దీంతో ఆ యువతి రోడ్డుపైనే పడిపోయింది. ఆ తర్వాత ఆమెను తీసుకుని కారులో ఎక్కించుకు వెళ్లిపోయాడు ప్రియుడు.

ఈ ఘటన రష్యాలోని యకటెరిన్‌బర్గ్‌లోని ఓ పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ వద్ద చోటు చేసుకుంది. ఆ షాపింగ్ కాంప్లెక్స్ రెండో ఫ్లోర్‌లో ఉన్న ఓ వ్యక్తి ఈ తతంగాన్ని వీడియో తీశాడు. ప్రస్తుతం ఆ వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఉన్నదాని ప్రకారం.. తొలుత కారు పార్కింగ్ ప్లేస్ వద్ద వ్యక్తి అతని గర్ల్ ఫ్రెండ్ పెదాలపై ముద్దుపెట్టుకున్నాడు.

 Shocking video shows man punching girlfriend to the floor

అంతకుముందు అతడు ఏం తప్పు చేశాడో ఏమోగానీ ఆ అమ్మాయి అతడి ముఖంపై, ఛాతీపై పంచ్‌లు చేయడం మొదలుపెట్టింది. అంతేగాక, కాలితో కూడా పలుమార్లు తన్నేసింది. అలాగే చేస్తుండగా అతడు మాత్రం ఆమెను ప్రేమగా దగ్గరకు లాక్కోవడం చేశాడు. అయినా, ఆ అమ్మాయి అదే తీరుతో వ్యవహరించింది. తన పంచ్‌లు కొనసాగించింది.

దీంతో అతడు ఏదో చెబుతూ కౌగిలించుకొని ఆమెను కూల్ చేసేందుకు ప్రయత్నించాడు. అయినా వినకుండా ఆమె అలాగే కొడుతూ తిడుతూ ఉండటంతో ఆగ్రహం ఆపుకోలేని అతడు గట్టిగా రెండు మూడు పంచ్‌లు ఇచ్చాడు. దీంతో ఆమె కిందపడిపోయింది. ఆ తర్వాత కూడా కొట్టాడు.

అనంతరం ఆమె కాలు చెప్పు ఊడిపోతే తొడిగే ప్రయత్నం చేశాడు. ఈ గొడవ సమయంలో ఓ మహిళ వారించేందుకు రాగా ఆమెను కూడా ఉరికించి కొట్టే ప్రయత్నం చేశాడు. అనంతరం కిందపడిపోయిన తన ప్రియురాలిని చేతుల్లోకి తీసుకొని మెల్లగా వెళ్లి కార్లో కూర్చొబెట్టాడు. కాగా, వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారి హల్‌చల్ చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+