హిల్లరీ క్లింటన్‌పైకి బూటు విసిరిన మహిళ అరెస్టు

Shoe thrown at Hillary Clinton during speech
లాస్ వేగాస్: అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌పై ఓ మహిళ బూటు విసిరింది. ఆ మహిళను ఫెడరల్ కస్టడీలోకి తీసుకున్నారు. లాస్ వేగాస్ సదస్సులో హిల్లరీ క్లింటన్ కీలకోపన్యాసం చేస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.

మండాలే రిసార్ట్‌లో జరిగిన సదస్సులో వేదికపైకి హిల్లరీ క్లింటన్ రాగానే బుధవారంనాడు అనూహ్యంగా ఆ సంఘటన జరిగింది. అయితే, ఆ బూటు హిల్లరీకి తాకలేదు. దానిపై ఆమె వెంటనే హాస్యమాడారు కూడా. తనపైకి ఎవరైనా ఏమైనా వస్తువు విసిరారా అని ఆమె అడిగారు. సర్కస్ ప్రదర్శననా అని అమె అడిగారు.

అక్కడ ఉన్న దాదాపు వేయి మంది ఒక్కసారిగా నవ్వారు. హిల్లరీ క్లింటన్ తన ప్రసంగాన్ని ప్రారంభించగానే హర్షధ్వానాలు చేశారు. ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ ఇంత వివాదాస్పదమని తనకు తెలియదని వ్యాఖ్యానించారు.

హిల్లరీ క్లింటన్‌పైకి బూటు విసిరిన మహిళను విచారిస్తామని, ఆమె క్రిమినల్ అభియోగాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు. అయితే, ఆ మహిళ వివరాలు వెల్లడించడానికి నిరాకరించారు నల్లటి, ఆరెంజ్ రంగు బూటును వేదిక మీంచి స్వాధీనం చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+