గన్ నేనే ఇస్తా: నా ముద్దుల కుక్కను చంపేయండి
న్యూయార్క్: దిక్కుతోచని స్థితిలో ఉన్న ఓ మహిళ తన కుక్క ను తుపాకితో కాల్చిచంపి పుణ్యం కట్టుకోండి అంటూ ఫేస్ బుక్ లో పోస్టు చేసింది. ఎవ్వరైనా సరే, ఒకరు దయచేసి ముందుకు రండి అంటూ మనవి చేసింది.
అమెరికాలోని టెక్సాస్ లో నివాసం ఉంటున్న మహిళ ఒకరు ఫేస్ బుక్ ఫ్రెండ్స్ కు ఈ విధంగా మనవి చేసింది. తనకు ఆర్థిక స్థోమత సరిపోవడం లేదని, అందు వలన ముద్దుగా, బొద్దుగా ఉండే తన కుక్కను చంపేయాలని చెప్పింది.

గన్ నేనే ఇస్తానని జస్ట్ ఇక్కడికి
వచ్చి కుక్కను కాల్చి చంపేయాలని మనవి చేసింది. ఈ విషయం తెలుసుకున్న జంతు సంరక్షణ అధికారులు ఆ మహిళ ఇంటికి వెళ్లి ఆ కుక్కను కాపాడారు. తరువాత కుక్కకు వ్యాక్సిన్ లు వేయించి వేరే మహిళకు దాని భాధ్యతను అప్పగించారు.
కుక్కను చూసుకోవడానికి ఎవరైనా ముందుకు వస్తే తాము అప్పగించడానికి సిద్దంగా ఉన్నామని అధికారులు చెప్పారు. శునకాన్ని పోషించలేక, అల్లారు ముద్దుగా మూడన్నర సంవత్సాలు పెంచుకున్నఆ కుక్కను చంపలేక ఆమె ఈ విధంగా ఫేస్ బుక్ లో ప్రకటన చేసిందని అధికారులు తెలిపారు. అయితే ఆమె పూర్తి వివరాలను మీడియాకు వెల్లడించలేదు.












Click it and Unblock the Notifications