హైవేపై కూలిన జెట్: ఏడుగురు మృతి(వీడియో)
లండన్: బ్రిటన్‌లో నిర్వహిస్తున్న షోర్‌హామ్ వైమానిక ప్రదర్శనలో అపశృతి చోటు చేసుకుంది. ఓ విమానం అదుపుతప్పి రద్దీగా ఉన్న హైవేపై కూలడటంతో ఏడుగురు వ్యక్తులు మరణించారు. ఆగ్నేయ ఇంగ్లండ్‌లోని ససెక్స్‌లో ఈ ఘటన జరిగింది.
1950 నాటి ఫైటర్ జెట్ విమానం విన్యాసాలు చేస్తుండగా అదుపుతప్పి హైవేపై వెళ్తున్న వాహనాలపై కూలిపోయింది. వెంటనే స్పందించిన స్థానికులు తగులబడుతున్న విమాన శిథిలాల్లోంచి పైలట్‌ను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.
అతడు కోలుకొంటున్నట్లు అధికారులు తెలిపారు. విమానం కూలిపోతున్న దృశ్యాలను స్థానికులు వీడియో తీసి ఇంటర్నెట్‌లో పెట్టారు.
సోమాలియాలో ఆత్మాహుతి దాడి: 14 మంది సైనికులు మృతి
మొగదిషు: సోమాలియాలో వేర్పాటువాద ఇస్లామిక్ ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 14 మంది సైనికులు మరణించారు. దక్షిణ తీరంలోని కిస్‌మయో పట్టణంలో ఉన్న సైనిక క్యాంపులోకి పేలుడు పదార్థాలు నింపిన కారుతో దూసుకెళ్లిన ఉగ్రవాదులు తమనుతాము పేల్చేసుకున్నట్లు పోలీసు అధికారి అహ్మద్ అలీ తెలిపారు.
కొంతకాలం క్రితం వరకు యూనివర్సిటీ క్యాంపస్‌గా ఉన్న ఆ ప్రాంతంలో ప్రస్తుతం సైనిక క్యాంపు నడుస్తున్నది. ఉగ్రవాదులు సైనికులు లక్ష్యంగా ఈ దాడికి పాల్పడ్డారు. రాత్రి ఉత్తర మొగదిశులోని బస్టాండ్ స్టేషన్ సమీపంలో కారు బాంబు పేలి మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.












Click it and Unblock the Notifications