న్యూజిలాండ్ టు నార్త్ అమెరికా: ట్విట్టర్ పిట్టకేమైంది? ఉలుకు, పలుకు లేకుండా
న్యూయార్క్: టాప్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ స్తంభించిపోయింది. మనదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా చాలా చోట్ల ట్విట్టర్ సేవలు నిలిచిపోయయి. న్యూజిలాండ్ మొదలుకుని నార్త్ అమెరికా దాకా ఇదే పరిస్థితి నెలకొంది. ఫలితంగా- ట్విట్టర్ ఖాతాదారులు అయోమయానికి గురి అయ్యారు. ట్విటర్ మేనేజ్ మెంట్ కు రిపోర్టుల మీద రిపోర్టులు కొడుతున్నారు.
నాలుగైదు గంటల వ్యవధిలోనే ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి నాలుగు వేలకు పైగా రిపోర్టులు అందినట్లు ట్వీట్ డెస్క్ వెల్లడించింది. సాంకేతిక లోపాల కారణంగానే తమ సేవలు నిలిచిపోయాయని వెల్లడించింది. త్వరలోనే దాన్ని సరి చేస్తామని పేర్కొంది.
We've been experiencing outages across Twitter and TweetDeck. You might have had trouble Tweeting, getting notifications, or viewing DMs. We're currently working on a fix, and should be back to normal soon.
— Twitter Support (@TwitterSupport) October 2, 2019
ట్విట్ డెస్క్ స్తంభించిన ప్రభావం ఉత్తర అమెరికాపై తీవ్రంగా పడింది. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో ఈ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఉలుకు, పలుకు లేకుండా ఉండిపోయింది.

జపాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్స్, భారత్, దక్షిణ కొరియా, ఇరాన్, ఈజిప్ట్, ఆఫ్రికా, ఐరోపా ఖండంలోని కొన్ని దేశాలు, గ్రీన్ ల్యాండ్, బ్రిటన్, బెల్జియం, కొలంబియా, అర్జెంటీనా, కరేబియన్ దీవులు, మెక్సికో, నార్వే, డెన్మార్క్ ల్లోని పలు ప్రాంతాల్లో ట్విట్టర్ స్తంభించినట్లు ట్వీట్ డెస్క్ వెల్లడించింది. యుద్ధ ప్రాతిపదికన దీన్ని సరి చేస్తున్నట్లు వెల్లడించింది. త్వరలోనే సాధారణ స్థితికి చేరుకుంటుందని పేర్కొంది.












Click it and Unblock the Notifications