ఎక్కడంటే అక్కడ 'అది' చెప్తే ఊరుకుంటారా..? కొన్ని దేశాల్లో తాట తీస్తారు మరి..!!
అరక్ సిటీ/ హైదరాబాద్ : డార్లింగ్... ఐ లవ్ యూ..! బంగారం.. మనం పెళ్లి చేసుకుందాం..! అని ప్రేయసికి చెప్పేటప్పుడు వెనక ముందు చూసుకోవాలి మరి. మన దేశంలో ఐతే అమ్మాయి అన్నయ్యో, నాన్నో వీపు విమానం మోత మోగించి వదిలిపెడతారు.అదే వేరే దేశంలో ఐతే జైల్లో కూర్చోబెడతారు. ఔను మీరు చదువుతుంది నిజమే..! పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయి, ఇద్దరూ ఇక ఒకటవ్వాలనుకున్నా ఆ విషయాన్ని నలుగురిలో చెప్తే అది పెద్ద తప్పు. కొన్ని దేశాల్లో ఐతే నడుస్తుందేమో గాని మరికొన్ని దేశాల్లో మాత్రం నేరంగా పరిగణిస్తారు. అంతే కాదు మనసుపడ్డ అమ్మాయి మీద మనసులో మాట బహిరంగంగా చెప్పాలని చూసారో ఇక అంతే.. ! వారి ప్రేమ ఎపిసోడ్ కి చీకటే..! ఓ ప్రయివేటు కార్యక్రమంలో నలుగురిని చూసి మంచి మూడ్ తెచ్చుకున్న జంట తమ ప్రేమను బహిరంగంగా చెప్పి కష్టాలు కొని తెచ్చుకున్నారు. అది ఎక్కడ..? ఏంటి..?

ఆచారవ్యవహారాలకు, కట్టుబాట్లకు నిలయంగా ఉండే దేశం అది. అది ఇరాన్ లోని అరక్ నగరం. కస్టమర్లతో ఓ పెద్ద షాపింగ్ మాల్ కిటకిటలాడుతోంది. ఫుల్ రష్. ఓ అమ్మాయి, అబ్బాయీ వచ్చారు. పూలతో హార్ట్ ను అందంగా అలంకరించాడా యువకుడు. ''నన్ను పెళ్లి చేసుకుంటావా?" అంటూ తన మనసులోని మాటను ఆమెకు చెప్పాడు . అందరి ముందూ అతడలా ప్రపోజ్ చేసే సరికి ఆ అమ్మాయి ఆశ్చర్యపోయింది. 'ఓకే' చెప్పేసింది. ఆ అమ్మాయి, అబ్బాయి ఫుల్ హ్యాపీ. కానీ, ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు . పోలీసులు ఆ ఇద్దరినీ అరెస్ట్ చేశారు. ప్రపోజ్ చేస్తే నేరమా? అంటే ఇరాన్ లో అంతే మరి.ఇస్లాం సిద్ధాంతాల ఉల్లంఘన కిందకు వస్తుందక్కడ. పెళ్లికాని అమ్మాయిలు అబ్బాయితోగానీ, అబ్బాయిలు అమ్మాయిలతో గానీ మాట్లాడడం, తిరగడం నిషిద్ధం. ఇంత పబ్లిగ్గా ప్రపోజ్ చేయడానికి 'సిగ్గుండాలి ' అంటూ అధికారిక పత్రిక ఫార్స్ న్యూస్ వార్త రాసింది. చివరకు వారిని బెయిల్‌పై విడిచిపెట్టారు. అది మ్యాటర్..!!
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications