ఫేస్‌బుక్‌కు బానిసైతే అంతే, సిగ్గుపడే వారు 'తక్కువే'..!
ఫేస్‌బుక్‌కు వంటి వాటికి బానిసగా మారితే తీవ్ర ఒత్తిడిలో పడిపోతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫేస్‌బుక్ వల్ల బంధాలు పెంచుకోవడం, సంబంధాలు పునరుద్ధరించుకోవడం, మన ఆలోచనలు పదిమందితో పంచుకోవడం వంటి ప్రయోజనాలున్నాయి.
ఫేస్‌బుక్‌ను ఎంత వరకు ఉపయోగించుకోవాలో అంత వరకు ఉపయోగించుకుంటేనే బాగుంటుందంటున్నారు. అలా కాకుండా, అది లేకపోతే ఏమీ తోచడం లేదు అనే స్థాయిలో అనుబంధం పెంచుకుంటే మాత్రం ప్రాథమిక అవసరాలకు సంబంధించి జీవితంపై అసంతృప్తి పెరగడం, లేదా మూడ్ పాడవడం వంటి లక్షణాలు ఏర్పడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఫేస్‌బుక్‌కు, మూడ్ పాడవడానికి మధ్య సంబంధముందని మానసిక శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఫేస్‌బుక్ యూజర్లపై నిర్వహించిన మూడు దశల పరిశోధనల అనంతరం వారు ఈ అభిప్రాయం వెల్లడించారు. ఫేస్‌బుక్‌తో గడిపిన అనంతరం మూడ్ పాడవడం, ఫేస్‌బుక్ క్లోజ్ చేయగానే ఒంటరితనం అనుభవించడం జరుగుతుందని చాలామంది చెప్పారని పరిశోధకులు తెలిపారు.

ఫేస్‌బుక్

కాగా, సిగ్గుపడే తత్వం ఉన్న వారు ఫేస్‌బుక్ పైన చాలా ఎక్కువ సేపు గడుపుతున్నారట. అయితే, షేర్ చేసుకునేది మాత్రం చాలా తక్కువగా ఉంటుందంటున్నారు.

Click it and Unblock the Notifications