వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐసిస్ పైశాచికత్వం: స్విమ్మింగ్ ఫూల్లోకి దింపి...

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాదుల దారుణమైన మారణహోమానికి పాల్పడుతున్నారు. తమ పైశాచికత్వానికి నిదర్శనంగా నిలిచే మరో వీడియోను ఐసిస్ విడుదల చేసింది. ఇది ఏడు నిమిషాల నిడివి గల వీడియో.

ఇందులో బందీలను ఉక్కిరిబిక్కిరి చేసి చంపుతున్న దృశ్యాలు ఉన్నాయి. తొలుత ఐదుగురు బందీలను ఇనుప బోనులో ఉంచి, దానిని పెద్ద స్విమ్మింగ్ ఫూల్‌లో వదిలారు. ఆ బోనును ఐసిస్ ఉగ్రవాదులు నెమ్మదిగా ముంచుతుంటారు.

Sickening new ISIS video shows caged prisoners lowered into a swimming pool

అప్పుడు బోనులోని బందీలు ఉక్కిరిబిక్కిరు అవుతుంటారు. ఆ దృశ్యాలను ఐసిస్ ఉగ్రవాదులు అండర్ వాటర్ కెమెరాలతో చిత్రీకరించారు. బందీలు ఉక్కిరిబిక్కిరి అవుతుండగా.. వారిని స్విమ్మింగ్ పూల్‌లోకి పూర్తిగా ముంచి చంపేశారు.

ఆ తర్వాత బోను నీటి నుంచి వెలికి తీశారు. మరి కొందరిని కారులో ఉంచి దానిని గ్రనైడ్ మిసైల్ లాంచర్‌తో పేల్చారు. దీనిని కూడా వీడియో తీశారు. బందీల మెడకు పేలుడు పదార్థాలు అమర్చి తాడును చుట్టి వాటి ద్వారా కాల్చడం ద్వారా మెడలు తెగిపోయేలా చేశారు. వీటిని వీడియోలుగా తీసి విడుదల చేశారు.

English summary
Sickening new ISIS video shows caged prisoners lowered into a swimming pool
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X