మంత్రిపై ఫేస్ బుక్ లో అనుచిత వ్యాఖ్యలు
టోరంటో: కెనడా రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన భారతీయుడికి జాతి వివక్ష తప్పలేదు. మంత్రి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఓ సైనికుడు ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు. రక్షణ శాఖ అధికారులు విచారణ చేపట్టారు.
కెనడాలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడానికి భారత సంతతికి చెందిన (సిక్కు) హర్జీత్ సజ్జన్ శక్తి వంచన లేకుండా పని చేశారు. అందుకు అక్కడి ప్రభుత్వం ఆయనను కెనడా రక్షణ శాఖ మంత్రిగా నియమించారు.
అయితే కెనడా సైనిక దళాలలో పని చేస్తున్న ఓ సైనికుడు ఈ విషయం జీర్ణించుకోలేకపోయాడు. హర్జీత్ సజ్జన్ పై జాతి వివక్ష వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేశాడని ఆరోపణలు వచ్చాయి. విషయం తెలుసుకున్న అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు.

రక్షణ శాఖ మంత్రి హర్జీత్ సజ్జన్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఫేస్ బుక్ లో పోస్టు చేశారని విచారణ కమిటిలోని ఓ అధికారి తెలిపారు. అయితే అనుచిత వ్యాఖ్యలు చేసిన సైనికుడి పేరు, ఏ వ్యాఖ్యలు చేశారు అనే వివరాలు వెల్లడించేందుకు సైన్యం నిరాకరించింది.
అయితే ఫ్రెంచి బాషలో రాసిన ఆ వ్యాఖ్యలను ఇప్పటికే ఫేస్ బుక్ నుంచి తొలగించామని అధికారులు స్పష్టం చేశారు. రక్షణ శాఖ మంత్రి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన సైనికుడిని గుర్తించి అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారని సమాచారం.












Click it and Unblock the Notifications