ఎవరు కొట్టారు?: బర్మింగ్‌హాంలో సిక్కు వ్యక్తిపై దాడి వీడియో హల్‌చల్
లండన్: బర్మింగ్‌హామ్‌లో ఓ సిక్కు వ్యక్తిని వీధుల్లో చితకబాదిన ఓ వీడియో ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. దీంతో, స్థానిక పోలీసులు దీని పైన విచారణ చేస్తున్నారు. ఈ సంఘటన మతపరంగా జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. సిక్కు వ్యక్తి పైన దాడి చేసిన వారు ఎవరో స్వచ్చంధంగా లొంగిపోవాలని పోలీసులు చెప్పారు.
డెయిలీ సిక్ అప్‌డేట్ అనే ఫేస్‌బుక్ పేజీలో ఈ దాడి ఫుటేజీ ఇంటర్నెట్లో పెట్టారు. ఆ ఫుటేజీలో ఓ వ్యక్తి తనను కొట్టేందుకు ప్రయత్నిస్తుండగా సిక్కు వ్యక్తి తన ముఖానికి చేతులు అడ్డం పెట్టుకున్నాడు.
ఈ ఘటన సమయంలో చుట్టుపక్కల చాలామంది గుమికూడారు. కానీ అతనిని రక్షించేందుకు ఎవరు కూడా ముందుకురాలేదు. చివరకు ఓ వ్యక్తి దానిని ఆపే ప్రయత్నం చేశాడు. ఇది ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది.

మిడ్ ల్యాండ్స్ పోలీసు అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ఓ వ్యక్తిని కొడుతున్న వీడియోను చూశామని, ఈ సంఘటన మార్చి 29వ తేదీన బర్మింగ్ హామ్ వీధుల్లో జరిగిందని చెప్పారు. ఈ సంఘటన మతపరంగా జరిగి ఉంటుందని అనుమానిస్తున్నట్లు చెప్పారు.
దీనిని తాము చాలా సీరియస్‌గా తీసుకున్నామని, దీనిపై పూర్తి విచారణ చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం తాము ఏం జరిగిందనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. సంఘటన ప్రాంతానికి వెళ్లి అడిగితే, ఎవరు కూడా తాము ఈ దాడికి పాల్పడ్డట్లు చెప్పలేదన్నారు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications