హాలీవుడ్ మూవీ ట్రయలర్‌లా, ఇదీ మీ భవిష్యత్తు: కిమ్‌ను వీడియోతో పడగొట్టిన ట్రంప్(వీడియో )
సింగపూర్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షులు కింగ్ జాంగ్ ఉన్‌లు మంగళవారం సింగపూర్‌లో భేటీ కావడం చారిత్రాత్మకం. ఈ భేటీ సానుకూలమని ఇరువురు నేతలు చెప్పారు. అణ్వాయుధాలను వదిలేసేందుకు అంగీకరిస్తే భవిష్యత్తులో ఉత్తర కొరియా ఇలా ఉంటుందంటూ ట్రంప్.. కిమ్‌కు దాదాపు నాలుగు నిమిషాల వీడియో చూపించారట. 'టూ మెన్, టూ లీడర్స్, వన్ డెస్టినీ (గమ్యం)' అంటూ వీడియో వివరించింది.
ఈ వీడియోను తన ఐపాడ్‌లో చూపించారు. ఈ వీడియోను చూపిన అనంతరం ఆర్థికంగా, సాంకేతికంగా అభివృద్ధి చెందిన భవిష్యత్ కోసం సరైన నిర్ణయాన్ని తీసుకోవాలని ట్రంప్.. కిమ్‌ను కోరారని తెలుస్తోంది. సాంకేతికతలో దూసుకుపోతున్న చైనా, దక్షిణ కొరియాల మధ్యలో ఉన్న ఉత్తర కొరియా అతి తర్వగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు. ఇది కిమ్‌ను బాగా ఆకర్షించిందట.

ఆ వీడియోలో ఉత్తర కొరియాలో పెద్ద పెద్ద భవనాలు, అంతరిక్షంతో సహా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ అద్భుత దేశంగా అవతరిస్తుందని చూపించారు. ఇది ఒక హాలీవుడ్ స్టయిల్ సినిమాను తలపించింది. హాలీవుడ్ స్టయిల్ వాయిస్ ఓవర్‌తో వీడియోను చూపించారు.
కాగా, సింగపూర్‌లో కిమ్-ట్రంప్ వర్కింగ్ లంచ్ ఇరుదేశాధినేతల అభిరుచులను తెలిపింది. షడ్రసోపేతమైన భోజనాన్ని ఏర్పాటు చేశారు. వీరి కోసం ఏర్పాటు చేసిన సిక్స్ కోర్స్ మీల్‌లో మూడు డిజర్ట్స్ కూడా ఉన్నాయి. ఈ భోజనంలో హేగన్ డాజ్స్ వెనిల్లా ఐస్‌క్రీమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇరు దేశాల నేతలు డైట్‌ను పక్కన పెట్టి విందును ఆస్వాదించారు.
ఇరుదేశాల నేతలకు సంప్రదాయ రొయ్యల కాక్‌టెయిల్‌తోపాటు అవకాడో సలాడ్, పచ్చి మామిడితో చేసిన కెర్బూ, మలేషియాకు చెందిన రైస్ వంటకం, తేనె, నిమ్మకాయలతో అలంకరించిన ఆక్టోపస్‌లతోపాటు కొరియన్ స్టఫ్ఫ్‌డ్ కూకుంబర్, గొర్రె మాంసంతోపాటు, బ్రకొలీ, రెడ్‌వైన్, స్వీట్ అండ్ సోర్ క్రిస్పీ పోర్క్, యంజూహు ఫ్రైడ్ రైస్, కాడ్‌ఫిష్-రాడిష్‌లు ఉన్నాయి. ఇక డిజర్ట్‌ల్లో డార్క్ చాక్లెట్ టార్టల్ గ్రెంచి, చెర్రీలతో అలంకరించిన హేగన్ డాజ్స్ వెనిల్లా ఐస్‌క్రీమ్, ట్రోపిజెన్నీ అనే ఫ్రంచి పేస్ట్రీ ఉన్నాయి.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications