Indo-Americans: అమెరికా ఎన్నికల్లో సత్తా చాటిన ఇండో అమెరికన్లు.. గెలిచిన వారంతా ఒకే పార్టీ..!
అమెరికా ఎన్నికల్లో భారత సంతతికి చెందిన వారు సత్తా చాటారు. ఇప్పటి వరకు ఆరుగురు ఇండో అమెరికన్లు సెనేటర్లుగా విజయం సాధించారు. గత ప్రభుత్వం ఐదుగురిగా ఉన్న ఇండో అమెరికన్ల సెనేటర్ల సంఖ్య ఇప్పుడు ఆరుకు చేరింది. అమెరికా ఎన్నికల్లో సెనేటర్లుగా గెలిచిన ఇండో అమెరికాన్లలో సుహాస్ సుబ్రమణ్యం (వర్జీనియా), రో ఖన్నా (కాలిఫోర్నియా), రాజా కృష్ణమూర్తి (ఇల్లినాయిస్), శ్రీ థానేదార్ (మిచిగాన్), అమిబెరా (కాలిఫోర్నియా), ప్రమీలా జైపాల్ (వాషింగ్టన్) ఉన్నారు.
ఇందులో శ్రీ తానేదార్, రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, డాక్టర్ అమిబెరా, ప్రమీలా జయపాల్ రెండోసారి విజయం సాధించారు. ఈసారి అమెరికా ఎన్నికల్లో 9 మంది ఇండో అమెరికన్లు బారిలో నిలిచారు. ఇందులో ఆరుగురు గెలుపొందారు. భవిష్యత్ ఈ సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది. సుహాస్ సుబ్రమణ్యం వర్జీనియాలోని 10వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్‌లోని US ప్రతినిధుల సభ ఓపెన్ సీటులో విజయం సాధించాడు. సహాస్ సుబ్రమణ్యం గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా హయాంలో టెక్ పాలసీ అడ్వైజర్‌గా పని చేసిన విషయం తెలిసిందే.

సుహాస్ 2020లో రాష్ట్ర శాసనసభ్యుడిగా తన రాజకీయ జీవితాన్ని మొదలు పెట్టారు. రాజా కృష్ణమూర్తి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో డెమోక్రాటిక్ పార్టీ నుంచి విజయం సాధించారు. ఇల్లినోయీ 8వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి గెలుపొందారు. రాజా కృష్ణమూర్తి రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్రత్యర్థి మార్క్ రిక్‌పై 30 వేలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాఇంచారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్న రాజా కృష్ణమూర్తి రాష్ట్రానికి మాజీ డిప్యూటీ కోశాధికారితో సహా పదవులను నిర్వహించారు. ఆయన 2016లో తొలిసారిగా చట్ట సభకు ఎన్నికయ్యారు.
డెమొక్రాటిక్ పార్టీ తరఫున పోటీ చేసిన మరో ఇండో అమెరికాన్ రో ఖన్నా.. కాలిఫోర్నియా (17వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్) నుంచి విజయం సాధంచారు. 2016 నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఈసారి కూడా అక్కడి ఓటర్లు రో ఖన్నాను సెనేటర్ గా గెలిపించారు. ఆయన ఆర్థిక సంస్కరణలు, టెక్నాలజీ, ఇమ్మిగ్రేషన్ పరమైన సమస్యలపై అడ్వొకేట్ హోదాలో పని చేస్తున్నారు. మిచిగాన్ (13వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్) నుంచి పోటీ చేసిన మరో భారత సంతతి వ్యక్తి శ్రీ థానేదార్ గెలుపొందారు.
రిపబ్లికన్ పార్టీ ప్రత్యర్థి మార్టెల్ బివింగ్స్‌ను 35 శాతం ఓట్ల తేడాతో మట్టి కరిపించారు. మరో ఇండో అమెరికన్ అయిన అమిబెరా ఈసారి కూడా కాలిఫోర్నియా (6వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్) నుంచి గెలుపొందారు. 2013 నుంచి వరుసగా ఆరు సార్లు గెలిచారు. తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ ఏడోసారి విజయం సాధించారు. ఆయన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిపై ఘన విజయం సాధించారు. మరో భారత సంతతికి చెందిన డెమోక్రటిక్ నేత ప్రమీలా జైపాల్ వాషింగ్టన్ 7వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి విజయం సాధించారు.
ఈమె 2017 నుంచి గెలుస్తూ వస్తున్నారు. రిపబ్లికన్ పార్టీ నేత డాన్ అలెగ్జాండర్‌ను ఓడించారు. 59 ఏళ్ల ప్రమీల జైపాల్.. డెమోక్రటిక్ పార్టీలో శక్తిమంతమైన నేతగా ఉన్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే.. గెలిచిన ఆరుగురు ఇండో అమెరికన్లు డెమోక్రాటిక్ పార్టీ నుంచే విజయం సాధించారు. యూఎస్ ఉపాధ్యక్షుడిగా పనిచేయనున్న జేడీ వాన్స్ కు భార్యగా భారత సంతతికి చెందిన ఉషను ఉన్నారు. ఆ తెలుగు వారి మూలాలున్న మహిళ.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications