భారత్‌లో నవంబర్ 10 నుంచి స్కైప్ ఫోన్ కాల్స్ బంద్
న్యూఢిల్లీ: 2014 నవంబర్ 10న తేదీ నుంచి భారత్‌లో స్కైప్ కాల్స్ సర్వీసును నిలిపివేస్తున్నట్లు స్కైప్ మాతృ సంస్ద మైక్రోసాప్ట్ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. దీంతో స్కైప్ అప్లికేషన్ ద్వారా భారత్‌లో మొబైల్ ఫోన్స్, లాండ్ ఫోన్స్‌కు ఉచితంగా కాల్స్ చేసుకునే అవకాశం ఉండదు.

ఇంటర్నెట్ సౌకర్యం ఉంటే స్కైప్ అప్లికేషన్ ద్వారా ఉచితంగా మొబైల్, ల్యాండ్ ఫోన్లకు కాల్ చేయవచ్చు. వాయిస్, వీడియో కాల్స్ సౌకర్యం ఇందులో ఉంటుంది. ఐతే భారత్‌లో ఈ సౌకర్యాన్ని నిలిపివేయడానికి గల కారణాలను మాత్రం మైక్రోసాప్ట్ వెల్లడించలేదు.
ఐతే విదేశాల నుంచి భారత్‌కు, భారత్ నుంచి విదేశాలకు వాయిస్, వీడియో కాల్స్ చేసుకునే సౌలభ్యం ఉందని, అలాగే భారత్‌లో స్కైప్ వైఫై, ఎస్ఎంఎస్ సర్వీసులు పనిచేస్తాయని తెలిపింది.












Click it and Unblock the Notifications