జర్మనీ నుంచి రష్యాకు విమానంలో 20 పాములు తెచ్చాడు, అందుకే..
బెర్లిన్: ఓ వ్యక్తి విమానంలో తనతో పాటు ఇరవై పాములను వెంట తీసుకు వచ్చాడు. సదరు వ్యక్తి జర్మనీ నుంచి పాములతో విమానంలో రావడంతో రష్యా విమానాశ్రయ అధికారులు అవాక్కయ్యారు.
రష్యాలోని షెరెమెటివో ఇంటర్నేషనల్ విమానాశ్రయ అధికారులకు ఈ వింత అనుభవం ఎదురైంది. జర్మనీ నుంచి వచ్చిన సదరు ప్రయాణికుడి బ్యాగులో ఇరవై పాములను గుర్తించారు. వాటిని చిన్న చిన్న పెట్టెల్లో ఉంచి, వాటిని మరో సంచిలో పేర్చి తెచ్చాడు.

జర్మనీలో పాములు కొని వాటిని రష్యాకు తీసుకు వచ్చినట్లుగా గుర్తించారు. పాములను కొనడానికి సంబంధించి అతడి వద్ద అన్ని పత్రాలు ఉన్నందువల్లే జర్మనీలోని డస్సల్‌డర్ఫ్ ఎయిర్ పోర్టులో అధికారులు ఆపకపోయి ఉండవచ్చునని, కానీ వాటిని రష్యాకు తెచ్చేందుకు అనుమతుల్లేవని చెప్పారు. ఆ పాములు విషపూరితమైనవి కావని సదరు వ్యక్తి చెప్పాడని, పాములను తరలించడం జర్మనీలో మాత్రం నేరమని చెప్పారు.












Click it and Unblock the Notifications